పెద్దపేగు క్యాన్సర్.. జీవనశైలే కీలకం!


Mon,April 27, 2015 12:35 AM

ఆధునిక జీవనశైలి మనకు తెస్తున్న ముప్పు క్యాన్సర్. ఈ క్యాన్సర్లలో కూడా ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ ఇటీవలి కాలంలో పెరుగుతుండడానికి కారణం ఆధునిక ఆహారపు అలవాట్లే. ఇంతకుముందువరకు యూరప్ దేశాల్లో ఎక్కువగా ఉన్న పెద్దపేగు క్యాన్సర్ ఇప్పుడు భారతదేశంతో సహా దక్షిణ మధ్య ఆసియాలో క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంచుకోవడం, ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలే ఈ ముప్పును తప్పించే ఉపాయాలు.

cancer


మన జీర్ణవ్యవస్థలో అతి ముఖ్య భాగం కోలన్. పెద్దపేగు, పురీషనాళాలను కలిపి కోలన్‌గా వ్యవహరిస్తారు. ఈ రెండు భాగాలకు వచ్చే క్యాన్సర్లు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. సాధారణంగా 50 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులిద్దరిలోనూ పెద్దపేగు క్యాన్సర్ కనిపిస్తుంది. కాని చిన్న వయసులోనే అంటే యుక్తవయసులోనే కూడా దీని బారిన పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతున్నది. ఇందుకు కారణం పిజ్జాలు, బర్గర్ల సంస్కృతేనంటే అతిశయోక్తి కాదు. అంతేగాకుండా సాధారణ మలబద్దకం లాంటి సమస్యల్లో కనిపించే లక్షణాలే పెద్దపేగు క్యాన్సర్‌లోనూ ఉండడం వల్ల దీన్ని గుర్తించడంలో ఆలస్యం జరిగి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

రిస్కు కారకాలు


ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం, అధిక కొవ్వు పదార్థాలు తీసుకోవడం, మధుమేహం, స్థూలకాయం, ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం పెద్దపేగు క్యాన్సర్‌కు దోహదపడే అంశాలు. మాంసాన్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేయాలి. వేపుడు, మరగబెట్టడం వల్ల రసాయనాలు ఉత్పత్తయ్యి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

-పెద్దపేగు క్యాన్సర్ గల కుటుంబ చరిత్ర
-పెద్దపేగులో పాలిప్స్
-పెద్దపేగులో గడ్డలు
-శారీరక వ్యాయామం లేకపోవడం
-అనారోగ్యకరమైన ఆహారం, స్థూలకాయం
-పెద్దపేగు, పురీషనాళం గోడల మీద వేలాది సంఖ్యలో పాలిప్స్ పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఒకవేళ చికిత్స అందించకపోతే ఇది క్యాన్సర్‌కి దారితీస్తుంది.

ఎలా గుర్తించడం?


మలంలో రక్తం పడుతున్నదంటే అప్రమత్తం కావాలి. మలబద్దకం, అతిసారం, తీవ్రమైన అలసట, బరువు తగ్గిపోవడం, వాంతులు, వికారం కూడా వ్యాధి లక్షణాలే. అయితే ఇవే లక్షణాలు జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇతర జబ్బుల్లో కూడా కనిపిస్తాయి కాబట్టి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. క్యాన్సర్‌ని గుర్తించడానికి కొలనోస్కోపీ మేలైన పరీక్ష. పెద్దపేగు, పురీషనాళం లోపలి గోడల్లో పెరిగే పాలిప్స్ వల్ల ఇది ప్రారంభమవుతుంది. తరువాత క్యాన్సర్‌కి దారితీస్తుంది. అయితే చాలా సందర్భాల్లో క్యాన్సర్ రాకపోవచ్చు. ప్రాథమిక దశలో ఉండే పాలిప్స్ వల్ల క్యాన్సర్ రాదు. ఇలాంటి పాలిప్స్‌ని ముందుగానే కనిపెట్టడానికి కొలనోస్కోపీ సహాయపడుతుంది.

క్యాన్సర్ ప్రారంభంలో ఎటువంటి సంకేతాలూ కనిపించవు. అయినప్పటికీ స్క్రీనింగ్ చేయడం ముఖ్యం. అందుకే 50 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తీ పెద్దపేగుకు కొలనోస్కోపీ చేయించుకోవడం వల్ల క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టడానికి వీలుంటుంది. పెద్దపేగు క్యాన్సర్ ఉందేమోనని అనుమానం కలిగితే కొలనోస్కోపీ చేయిస్తారు. దీనిలో మెత్తగా ఉండే ట్యూబును పెద్దపేగులోకి పంపిస్తారు. ఈ ట్యూబ్‌కి కెమెరా, ఇతర శస్త్రచికిత్సా పరికరాలు అనుసంధానంగా ఉంటాయి. కొలనోస్కోపీ ద్వారా పాలిప్స్‌ను పూర్తిగా నిర్మూలించవచ్చు.
అవసరాన్ని బట్టి బయాప్సీ చేస్తారు. దీంతో పాటు కాలేయ పనితీరు పరీక్ష చేయడం ద్వారా క్యాన్సర్ కాలేయానికి పాకిందా లేదా తెలుస్తుంది.

క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి సీటీ చేస్తారు. అల్ట్రాసౌండ్, ఎంఆర్‌ఐ, ఛాతి ఎక్స్‌రే, పెట్ పరీక్షల ద్వారా కూడా క్యాన్సర్ కణజాలాన్ని గుర్తించవచ్చు.ఎవరికైనా 40 ఏళ్ల లోపు పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయితే ఫ్యామిలియల్ ఎడెనోమెటియస్ పాలపొసిస్ (ఎఫ్‌ఏపీ) చికిత్స అందించాల్సి ఉంటుంది. హెరిడిటరీ నాన్ పాలిపొసిస్ కోలరెక్టల్ క్యాన్సర్ వల్ల పెద్దపేగుకే కాకుండా ఇతరత్రా క్యాన్సర్లు కూడా వస్తాయి. జన్యుసంబంధ పరీక్షలు చేయడం వల్ల దీన్ని గుర్తించవచ్చు.

santosh


చికిత్స


-క్యాన్సర్ దశను బట్టి చికిత్స ఉంటుంది.
ప్రాథమిక దశలో ఉన్నప్పుడు క్యాన్సర్ పెద్దపేగు, పురీషనాళ గోడలను దాటి పక్కకు వస్తుంది. రెండో దశలో శోషరస గ్రంథుల వరకు వ్యాపిస్తుంది. మూడో దశలో శోషరసం ద్వారా శరీరం లోని ఇతర అవయవాలకు చేరుతుంది. నాలుగవదైన చివరి దశలో దూరంగా ఉండే కాలేయం, ఊపిరితిత్తులకు కూడా వ్యాపిస్తుంది. చికిత్సలో భాగంగా శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మాత్రమే శస్త్రచికిత్స చేస్తారు. ఆఖరి దశలో ఉన్నప్పుడు కీమోథెరపీ మాత్రం ఇస్తారు.
ఆరోగ్యకరమైన జీవనశైలే పెద్దపేగును నివారించే ఔషధం. ఆరోగ్యకరమైన ఆహారం, అధిక బరువు పట్ల శ్రద్ధ వహించాలి.

3421
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles