పెండ్లిళ్ల సంత.. ఇదో వింత!


Tue,August 7, 2018 11:24 PM

అది చైనాలోని షాంఘై నగరం. భారీగా వర్షం పడుతున్నది. ఎక్కడి జనజీవన వ్యవస్థ అక్కడ అస్థవ్యస్థంగా ఆగిపోయింది. వర్షం తేరుకునేలోపు అక్కడ ఓ వింత జరిగింది. వరుసగా గొడుగులు పెట్టి వాటిపై వర్షానికి తడువకుండా ప్లాస్టిక్ కవర్లలో పేపర్లు పెట్టారు. ఎందుకు?
china-marriage
ఇదే పెండ్ల్లిళ్ల సంత. ఆ కాగితాల్లో అమ్మాయి, అబ్బాయి వివరాలుంటాయి. వయస్సు, వార్షికాదాయం, విద్యార్హతలు, పుట్టిన తేదీలు, రాశులు వంటి అన్ని వివరాలూ ఇందులో పొందుపరుస్తారు. 2005 సంవత్సరం నుంచి ఈ సంత జరుగుతున్నది. ప్రతి వారాంతంలో పెండ్లి సంబంధాల కోసం ఈ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతూ వస్తున్నది. చైనాలో జనాభా పెరుగుతున్నది. అవసరాలు పెరుగుతున్నాయి. కానీ యువతకు ఆలస్యంగా పెళ్లిళ్లు అవుతున్నాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్స్ గణాంకాల ప్రకారం 2020 నాటికి చైనాలో మూడు కోట్ల మంది పెండ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారని అంచనా. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది సాధారణ సమస్యగా మారుతున్నది. అమెరికా, జపాన్, భారత్ వంటి దేశాల్లో కూడా పెండ్లి కాని యువత సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ముఖ్యంగా చైనాలో అమ్మాయిలు ఎక్కువ చదువుకోవడం, వరుడు కూడా చదువుకున్న వాడు కావాలనుకోవడం వల్ల ఇలా జరుగుతుందని ఓ అభిప్రాయం. చైనాలో పెండ్లికి చట్టబద్ధమైన వయసు అబ్బాయిలకు 22, అమ్మాయిలకు 20 ఏండ్లు. ఇదిలా ఉండగా ఆన్‌లైన్‌లో పెళ్లి వెబ్‌సైట్లు, పెళ్లి సంబంధాల మధ్యవర్తులకు చాలా గిరాకీ ఉన్నది.
china-marriage2

1074
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles