పుస్తక ప్రదర్శన అంటే విజ్ఞానభాండాగారం


Sat,December 15, 2018 01:07 AM

గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో పుస్తకప్రదర్శననిర్వహిస్తున్నారు. 25 దీర్ఘకవితలు, 129 మంది కవులతో పొక్కిలి కవితా సంకలనం తీసుకురావడంతో పాటు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులుగా ఉద్యమ భాగస్వామిగా ఉన్న కవి, రచయిత జూలూరి గౌరీశంకర్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడుగా ఉన్నారు. పుస్తక ప్రదర్శన అంటే పుస్తకాలు అమ్ముకునే శాల కాదని, విజ్ఞాన భాండా గారం అంటున్నారు.
Srinivaas

బుక్ ఫెయిర్ విశిష్టత ఏంటి?

-32వ పుస్తక ప్రదర్శన దేశవిదేశాల నుంచి వచ్చిన పబ్లిషర్స్‌కు వేదిక కానుంది. భిన్న వర్గాల వారి ఆలోచనలకు, అభిరుచులకు అనుగుణంగా వేలా ది పుస్తకాలు అందుబాటులోకి తెచ్చి వారిలో పఠనాశక్తిని పెంపొందించడం బుక్ ఫెయిర్ విశిష్టత. కేవలం పుస్తకాల ప్రదర్శన మాత్రమే కాకుండా మన సంస్కృతి, సాహిత్యం, సాహిత్యవేత్తల సేవలను నెమరువేసుకునే ప్రయత్నం చేస్తుంది.

పుస్తక ప్రదర్శన ఉద్దేశం? ఎలాంటి పుస్తకాలు ప్రదర్శనలో ఉంటాయి?

-పుస్తక పఠనాన్ని పెంపొందిండం ప్రధాన ఉద్దేశం. అనేక రకాల పుస్తకాలు ప్రదర్శనలో ఉంటాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన పుస్తకాలే కాకుండా.సాహిత్యం, సాంస్కృతిక, విద్య, వైద్య, వంటలు, బ్యూటీ టిప్స్ బుక్స్, భక్తి, ముక్తి, అనురక్తికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి. ఈ ప్రదర్శనకు వయోభేదం లేకు ండా అన్ని వర్గాల వారికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.

పుస్తకాలకు ఆదరణ ఉందా? వేటికి ఎక్కువుంది?

-టెలివిజన్లు, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు వచ్చాక పుస్తక పఠనం కొంతమేరకు తగ్గినప్పటికీ పుస్తకాల అమ్మకాలు మాత్రం తగ్గలేదు. పోటీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ సాహిత్యం, చరిత్ర పుస్తకాలకు డిమా ండ్ పెరిగింది. పీడీఎఫ్, ఈబుక్ కాపీలను ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకొని మరీ చదువుతున్నారు. పుస్తకానికి ఆదరణ తగ్గలేదు అనడానికి గత ఏడాది వచ్చిన పదిలక్షల మంది పాఠకులే నిదర్శనం.

ఇది ఎలా సాధ్యమైంది?

-పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయడానికి ముందు మా సొసైటీ విస్తృత ప్రచారం చేసింది. ప్రజలను ఈ ప్రదర్శనలో భాగస్వాములను చేయడానికి వారి వద్దకు వెళ్లాం. స్కూల్స్, కాలేజీలు, యువజనసంఘాలు, చివరికి రైల్వేకార్మికుల దగ్గరకు కూడా వెళ్లి పుస్తక ప్రదర్శన పై అవగాహన కల్పిం చాం. ప్రదర్శనలో సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగడం వల్ల అది ఒక ఉత్సవ జాతరలా నిర్వహించగలిగాం.

తెలంగాణకు ఏ మేరకు ఉపయోగం?

-ఈ పుస్తక ప్రదర్శన ద్వారా తెలంగాణ సాహిత్యం, తెలంగాణ హిస్టరీ, ఎకానమిక్స్, కల్చర్, సోషియాలజీ సామాజిక రంగాలకు సంబంధించిన రాజకీయ, వారసత్వ ఇలా అన్ని రకాలకు సంబంధించిన అంశాలను ప్రచారం చేశాం. పుస్తక ప్రదర్శన సమయంలోనే తెలంగాణ పోటీ పరీక్షల పుస్తకాలు కొత్తగా రావడం వల్ల వాటిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కలిగింది. వేల సంఖ్యలో తెలంగాణ పుస్తకాలు వచ్చాయి, అమ్ముడు పోయాయి. తెలంగాణ ఎలా అన్ని రంగాల్లో పునఃనిర్మించబడుతుందో ప్రాజెక్టులు కడుతున్నారో పుస్తకాల ప్రాజెక్టులు అట్లే కట్టాలన్నది సొసైటీ ఉద్దేశం. జ్ఞానాన్ని ఇంటింటికి తీసుకెళ్లడమే మా ధ్యేయం.

ఈసారి ఎంతమంది రానున్నారు?

-ఈసారి పుస్తక ప్రదర్శనకు పదిలక్షలకు మించి పాఠకులు రానున్నారు. గతేడాదితో పోల్చితే వసతులు కూడా మరింత విస్తృతపరిచాం. ఈ వేడుకల్లో పదిహేను లక్షల మంది భాగస్వాముల వుతారని అనుకుంటున్నాం.

తెలంగాణ వచ్చాక ప్రదర్శనలో వచ్చిన మార్పులేంటి?

-తెలంగాణ వచ్చాక పుస్తక ప్రదర్శన కోణం పూర్తిగా మారింది. విస్తృతి పెరిగింది. ఎక్కడో నెక్లెస్‌రోడ్డులో జరుపుకొంటారు అనే దశ నుంచి పదిలక్షలమంది పుస్తక ప్రదర్శనకు వచ్చే కార్యక్రమంగా మారింది. ఒక రకంగా దసరా, దీపావళి పండుగలాగ పుస్తకాల పండుగగా రూపొందింది. డిసెంబర్ నెల వచ్చిందంటే పుస్తకాల పండుగ వస్తుంది అనేంత విస్తృతి పెరిగింది.

ప్రభుత్వసహకారం ఎలా ఉంది?

-ఉద్యమ నాయకుడే పాలకుడిగా ఉండడం, కవి, రచయిత కూడా అయిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆయన సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. తెలంగాణ కళాభారతి ప్రాంగణాన్ని ప్రదర్శనకు ఉచితంగా ఇస్తున్నారు. తెలంగాణ భాషాసాంస్కతిక, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రవెంకటేశం స్వయంగా వచ్చి ప్రదర్శనను పరిశీలిస్తున్నారు. ఒక రోజు ముఖ్యమంత్రి సందేశాన్ని కూడా వినిపిస్తున్నాం.

860
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles