పువ్వుల్లో దాగున్న..


Fri,August 10, 2018 01:18 AM

చెట్టు కొమ్మన ఉండాల్సిన పువ్వులు బట్టల మీద హంగామా చేస్తే కనులకు విందుగా ఉంటుంది.. ఆ పువ్వుల్లో దాగున్న ఆ అందమే వేరు. ఫ్లోరల్ ప్రింట్‌లతో ఆ డిజైన్‌లతో మెరిపించిన.. లెహంగాల గురించి ఈ వారం ఫ్యాషన్‌లో..
Fashan
1. రాయల్ బ్లూ కలర్ రాసిల్క్ మెటీరియల్‌కి కాటన్ ఫ్లోరల్ ప్రింటెడ్ సిల్క్ మెటీరియల్‌ని బార్డర్‌గా వేశాం. ట్విర్ల్ బార్డర్ ఈ లెహంగా అందాన్ని మరింత పెంచింది. బార్డర్ మెటీరియల్‌నే బ్లౌజ్‌గా ఎంచుకొని హై నెక్, డ్రాప్‌తో డిజైన్ చేశాం. సెల్ఫ్ ప్రింట్ వచ్చిన జార్జెట్ దుపట్టాని డబుల్ డై చేయించాం. దీనికి టస్సెల్స్ అదనపు ఆకర్షణ.

2. ఆరెంజ్ కలర్ బెనారస్ లెహంగా ఇది. దీని మీద ఫ్లోరల్ డిజైన్ సెల్ఫ్ వీవింగ్ వచ్చింది. దీనికి గోల్డెన్ బార్డర్ జతచేశాం. రామాగ్రీన్ కలర్ రాసిల్క్ బ్లౌజ్ పైన థ్రెడ్, సీక్వెన్స్‌లతో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాం. మధ్యలో బటన్స్, పెప్లమ్ హ్యాండ్స్ ఈ డ్రెస్ అందాన్ని పెంచాయి. షిఫాన్ దుపట్టాని ఆరెంజ్, గ్రీన్ కాంబినేషన్‌లో డై చేయించి, గోల్డెన్ బార్డర్ వేశాం.
Fashan1
3. పసుపు పచ్చని ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన ఆర్గంజా మెటీరియల్ ఇది. దీన్ని లెహంగాగా డిజైన్ చేసి.. దానికి పీచ్ కలర్ గోటా బార్డర్‌ని జతచేశాం. దానికి ఇరువైపులా పీచ్ రాసిల్క్‌తో హైలైట్ చేశాం. పీచ్ కలర్ రాసిల్క్ బ్లౌజ్ మీద సింపుల్‌గా థ్రెడ్ వర్క్‌తో నింపేశాం. ఇదే రంగు జ్యూట్ సిల్క్ దుపట్టాని ఎంచుకొని దానికి గోల్డెన్ బార్డర్ వేశాం. అక్కడక్కడ బుటీస్ ఇవ్వడంతో సూపర్‌గా కనిపిస్తున్నది.

4. ైస్టెల్‌లుక్‌తో సూపర్‌గా కనిపించేందుకు ఈ డ్రెస్ ఎంచుకోండి. పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన లెహంగాని ఎంచుకున్నాం. దీనికి మ్యాచింగ్‌గా పింక్ కలర్ రాసిల్క్ బ్లౌజ్‌ని తీసుకొని బీడ్స్, థ్రెడ్‌లతో నాట్ వర్క్ చేయించాం. హ్యాండ్స్, నెక్ దగ్గర కట్‌వర్క్ ఫినిషింగ్ ఇచ్చాం. పింక్ కలర్ నెట్ దుపట్టాకి, సన్నని గోల్డ్ బార్డర్ కరెక్ట్‌గా మ్యాచ్ అయింది.

5. సమ్‌థింగ్ డిఫరెంట్ కోరుకునేవాళ్లు ఈ డ్రెస్ వేయాల్సిందే! గ్రే కలర్ ఆర్గంజా మెటీరియల్‌ని లెహంగాలా కుట్టాం. దాని మీద మొత్తం పువ్వుల డిజైన్ వచ్చేలా మెషీన్ ఎంబ్రాయిడరీ చేయించాం. ఎర్రని సిల్క్ మెటీరియల్ మీద ముత్యాలు, జర్దోసీలతో హ్యాండ్ ఎంబ్రాయిడరీ
ఇవ్వడంతో మెరిసిపోతున్నది. దీనికి గ్రే కలర్ నెట్ బెల్ స్లీవ్స్ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఎర్రని జార్జెట్ దుపట్టాకి గోల్డెన్ బార్డర్ సరిగ్గా సరిపోయింది.
Swetha

647
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles