పులులకు ఆలవాలం... పెంచ్ నేషనల్ పార్క్


Thu,August 9, 2018 11:09 PM

దేశంలోని పులుల సంరక్షణా కేంద్రాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచింది... మధ్యప్రదేశ్‌లోని పెంచ్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ. ఈ జాతీయ పార్క్‌ను ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్‌గా పిలుస్తారు.
pench-national-park
ఈ జాతీయ వనంలో అనేక కాల్వలు, నాలాలు ప్రవహిస్తుండడంతో ఎప్పుడూ పచ్చదనంతో అలరాతుంది. ఈ పార్క్‌లోని అతిఎత్తైన ప్రాంతం కాలపహార్. ఇది సముద్ర మట్టానికి 650 అడుగుల ఎత్తులో ఉంది. పెంచ్ నది ఈ పార్క్ గుండా ప్రవహిస్తుంది. పులులతో పాటుగా అనేక జంతువులకు ఇది ఆలవాలంగా ఉంది. పార్క్‌లో ఐదు చోట్ల నిరంతరం ప్రవహించే జలపాతాలు కనువిందు చేస్తాయి. పెంచ్ పార్క్‌ను పులుల సంరక్షణ కేంద్రంగా 1977లో ప్రకటించారు. ఈ పార్క్ వైశాల్యం 449.39 చదరపు కి.మీ. 1983లో దీనిని జాతీయం చేశారు. దేశంలో 19వ పులుల సంరక్షన కేంద్రం ఇది. పెంచ్ నదిపై జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1977-1988 సంవత్సరాల మధ్య నిర్మించారు. పెంచ్ పార్క్‌లో 1200 రకాల వృక్షాలు ఉన్నాయి. దేశంలో అత్యధికంగా జంతువులు నివసిస్తున్న జాతీయ సంరక్షణా కేంద్రం పెంచ్. ఇ ఈ పార్క్‌లో జీపులో తిరిగే అవకాశంతో పాటు, ఏనుగు సవారీ, పెంచ్ రిజర్వాయర్‌లో బోటింగ్, పెంచ్ నదిలో రివర్ రాఫ్టింగ్ వంటి సదుపాయాలూ ఉన్నాయి.

1060
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles