పురుషుల్లో లైంగిక సమస్యలకు హోమియో చికిత్స


Tue,August 15, 2017 12:00 AM

లైంగిక సమస్యలనేవి పురుషుల్లో చాలా చిన్న వయసులోనే ఆరంభం కావచ్చు. లేదా కొన్ని సంవత్సరాల లైంగిక జీవనం తర్వాత కూడా ప్రారంభం కావచ్చు.
ఈ సమస్యల కారణాలు కొన్ని శారీరకమైనవి కావచ్చు. కొన్ని మానసికమైనవి లేదా కొన్ని సందర్భాల్లో రెండు కలగలిపి ఉండొచ్చు.
depressed
లైంగిక సమస్యలు సాధారణంగా పురుషుల్లో 20-40 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా ఉంటాయి. లైంగిక సమస్యతో బాధపడేవాళ్లలో చాలా లక్షణాలు ఉంటాయి.
-లైంగిక తృప్తి లేకపోవడం.
-వీర్యం మోతాదు తగ్గడం.
-పురుషాంగ సమస్యలు.
-శీఘ్రస్కలనం.

కారణాలు


-శారీరక కారణాలు - విపరీతమైన నరాల బలహీనత, సుఖవ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత, ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు, మద్యపానం, కొన్ని రకాల మందులు, పుట్టుకతో వచ్చే లోపాలు,
-మానసిక కారణాలు - మానసిక ఆందోళన, విపరీత ధోరణి, డిప్రెషన్, అలసట, లైంగిక భయాలు, లైంగిక పరంగా కలిగే నొప్పి.

హోమియో చికిత్స


-పురుషుల్లో లైంగిక సమస్యలన్నింటికీ పాజిటివ్ హోమియోపతిలో చక్కటి, సురక్షితమైన, శాశ్వతమైన చికిత్స అందుబాటులో ఉంది.
-లైంగిక బలహీనత రావడానికి గల కారణాలు విశ్లేషించుకొని మందులు క్రమపద్ధతిలో వాడడం వల్ల 98 శాతం మందిలో ఈ సమస్యను కచ్చితంగా నయం చెయ్యవచ్చు. పాజిటివ్ హోమియోపతిలో కాంథరిస్, పాస్‌ఫోరిక్ యాసిడ్, మెర్సస్ ఆల్, దూజా, నక్స్‌వామిక, అవినా సెటివా, దాన్యానా, లైకోపోడియం లాంటి అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి.
-ఈ మందులు మనిషితత్వాన్ని బట్టి, బలహీనం కావడానికి కారణాలు, వ్యాధి లక్షణాలు, మానసిక స్థితి అన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని కాన్సిట్యూషనల్ పద్ధతి ద్వారా ఎంపిక చేసుకొని క్రమపద్ధతిలో వాడడం మంచి ఫలితాలను పొందవచ్చు.

630
Tags

More News

VIRAL NEWS