పుదీనా ఆరోగ్యపు ఖజానా


Wed,January 13, 2016 02:51 AM

pudina

మనం తీసుకునే ఆహారంగా తీసుకునే వాటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగినవి ఉన్నాయి. వాటిని విరివిగా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధులు చేరకుండా నివారించవచ్చు. అలాంటి వాటిలో పుదీనా ఒకటి.
-పుదీనాలో జలుబు, దగ్గును తగ్గించే శక్తి ఉంది. గొంతునొప్పి, మంట, తలనొప్పిని నివారిస్తుంది. పుదీనా టీ తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. దగ్గు ఎక్కువగా ఉన్నపుడు వేడి నీళ్లలో కాస్త పుదీనా రసం వేసి ఆ నీళ్లతో ఆవిరిపడితే మంచి ఫలితం ఉంటుంది.
-రోజు కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన, దంతక్షయం వంటి సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. అంతేకాకుండా నాలుక, దంతాలను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఇది దోహదం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలో సమస్యలు కలిగించే బాక్టీరియా చేరకుండా నివారిస్తాయి.
-నెలసరి సమయంలో కొందరిలో వాంతులవుతాయి. వికారంగా ఉండి ఏదీ తినాలని అనిపించక నీరసపడి పోతారు. అలాంటి వారికి పుదీనా టీ మంచి ఔషధమని చెప్పవచ్చు. ఆసమయంలో రోజుకు నాలుగైదు సార్లు పుదీనా టీ తీసుకోవడం వల్ల వాంతుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఆ సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గించడానికి కూడా ఇది ఉపకరిస్తుంది.
-సౌందర్య సంరక్షణలో కూడా పదీనా కీలకపాత్ర పోషిస్తుంది. మొటిమల మచ్చలపై పుదీనా రసాన్ని రాస్తే త్వరగా తగ్గిపోతాయి. వీటితో పాటు దోమ, తేనెటీగ, కందిరీగ వంటి కీటకాల కాటు వల్ల చర్మం కందినపుడు పుదీనా రసం రాయడం వల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది.
-ఆకలి మందగించినపుడు పుదీనా పచ్చడి చేసుకొని తింటే ఆకలి పెరుగుతుంది. పుదీనాను తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీర బరువును నియంత్రించడం, జ్ఞాపకశక్తి పెంపొందించడం, ఆస్తమాను తగ్గించడం ఇలా చాలా రకాలుగా పుదీనా ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

1990
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles