పుట్టుక అబ్బాయిగా.. పెళ్లి అమ్మాయిగా!


Sat,July 28, 2018 02:15 AM

తమిళనాడులోని తిరునెల్వెలికి చెందిన ప్రీతిష.. పుట్టుక మగ. అయితే అతనికి స్త్రీ సంబంధిత హార్మోన్ల వల్ల శరీరంలో చాలా మార్పులు జరిగాయి. దీంతో తొమ్మిదో తరగతి చదివేటప్పుడే అమ్మాయిగా రాలనుకున్నాడు.
preetisha

ఏం చేయాలో తెలియక 16వ యేట తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వారు కూడా మార్పులు గమనించి లింగమార్పిడికి ఒప్పుకున్నారు. దీంతో పుణె వెళ్లి లింగమార్పిడి సర్జరీ చేయించుకొని, అమ్మాయిగా మారాడు. ప్రీతిషగా పేరు మార్చుకొని ఏ పనైనా నిజాయితీగా చేసేది. ఈ సమయంలో తల్లిదండ్రులకు తోడుగా ఉండేందుకు రైళ్లలో కీ చెయిన్లు, బొమ్మలు అమ్మి రోజుకు రూ.400 సంపాదించింది. పుణె నుంచి ఢిల్లీకి వెళ్లి ఆరేండ్లపాటు అక్కడే ఉండి ఆర్టిస్ట్‌గా స్థిరపడింది. వీధి నాటికలు వేయడం, వివాహం, బర్త్‌డే వంటి శుభకార్యాల్లో పాల్గొని కాలం వెళ్లదీసేది. ఒక్కోసారి సరైన ఆదాయం లేక ఎన్నో ఇబ్బందులు పడింది ప్రీతిష. ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ బిజినెస్ జనరేటింగ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించింది. రోజుకు 11 ఆర్డర్లకు పైగా డెలివరీ చేసేది. దీంతో రోజుకు రూ.700 సంపాదించి గౌరవంగా బతికేది. ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరి తల్లిదండ్రుల అంగీకారంతో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ప్రీతిష. అయితే, తమిళనాడులో పెళ్లి చేసుకొన్న తొలి లింగమార్పిడి జంటగా వీరు నిలిచారు.

1510
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles