పుట్టగొడుగులతో యవ్వనం!


Tue,August 7, 2018 01:21 AM

Mushroom
పుట్టగొడుగులు ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడతాయని మనందరికీ తెలిసిందే. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే పుట్టగొడుగులు వృద్ధాప్యాన్ని కూడా దూరం చేసి యవ్వనాన్ని ప్రసాదిస్తాయట. అందుకే ఈ మధ్యకాలంలో విదేశాల్లో పుట్టగొడుగుల వాడకం రెట్టింపు అయింది.


పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. ఇతర కూరగాయల మాదిరిగా పుట్టగొడుగులను ఉడికించినప్పటికీ వాటిల్లోని యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఏమాత్రం మారదు. మనం తీసుకున్న ఆహారం ఆక్సీకరణకు గురైనప్పుడు హానికారక ఫ్రీరాడికల్స్ శరీరంలో విడుదలవుతాయి. ఇవి శరీర కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా అల్జీమర్స్ వంటి వ్యాధులు సోకుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ డీఎన్‌ఏపై కూడా ప్రభావం చూపి వృద్ధాప్యానికి కారణం అవుతాయి. పుట్టగొడుగుల్లో ఉండే ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్ ఎక్కువ విడుదల కాకుండా చేయడంతో యవ్వనంగా కనిపిస్తారు.

87
Tags

More News

VIRAL NEWS

Featured Articles