పీసీఓఎస్ నియంవూతణ -9


Sat,November 9, 2013 01:22 AM

పీసీఓఎస్‌ను అదుపులో ఉంచే త్రికోణాసనంలోని రెండు వేరియేషన్స్ ఈవారం...
పార్శ్వ కోణాసనం
మొదట నిటారుగా నిలబడాలి. గాలి పీల్చుకుని రెండు పాదాలు ఒక మీటరు దూరం జరపాలి. అరచేతులు భూమివైపుగా ఉండాలి. నెమ్మదిగా గాలి వదులుతూ కుడిపాదాన్ని కుడివైపుగా తిప్పుతూ 90 డిగ్రీల కోణంలో వంచాలి. ఎడమకాలును వంచకూడదు. కుడి అరచేతిని కుడికాలి పక్కగా ఉంచి ఎడమ చేతిని ఎడమచెవి మీదుగా భూమికి సమాంతరంగా తీసుకెళ్లాలి. ఈ స్థితిలో అరనిమిషం పాటు గాలి మామూలుగా పీలుస్తూ ఉండాలి. గాలి పీలుస్తూ ముందుగా కాలును, తర్వాత చేతిని యథాస్థితికి తీసుకురావాలి. ఇదే మాదిరిగా ఎడమవైపు కూడా చేయాలి.

ఉపయోగాలు :
- కాలి మడమలు, మోకాళ్లు మొదలైన వాటిని ఉత్తేజపరుస్తుంది.
-సయాటికా, కీళ్లనొప్పులను నివారిస్తుంది.
-నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది.
-మలబద్దకం నివారిస్తుంది.

పరివృత్త త్రికోణాసనం
పరివృత్త త్రికోణాసనం నిటారుగా నిలబడాలి. రెండు పాదాలను ఒక మీటరు వెడల్పు దూరంగా ఉంచాలి. రెండు చేతులను భూమికి సమాంతరంగా, భుజాలకు సమంగా చాచాలి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని గాలి వదులుతూ కుడి చేతిని ఎడమ పాదానికి ఆన్చాలి. చేతిని వెనుకవైపు నుంచి తలమీదుగా నిటారుగా ఉంచి చూపును ఎడమ చేతివైపు ఉంచాలి. ఇదే స్థితిలో కొన్ని సెకన్లు ఉండి తిరిగి యథాస్థితికి రావాలి. ఇదే పద్ధతి ఎడమవైపు కూడా చేయాలి.
ఉపయోగాలు :
- రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే నడుము సన్నబడుతుంది.
-పునరుత్పత్తి అవయవాలకు చాలా మంచిది.

గమనిక
- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.


yoga

4126
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles