పీసీఓఎస్ నియంవూతణ -1


Fri,September 6, 2013 11:53 PM

ఈరోజుల్లో చాలామంది మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్)తో బాధ పడుతున్నారు. రుతుక్షికమం సరిగ్గా లేకపోవడం, అండోత్పత్తి జరగకపోవడం వంటివేకాదు దీర్ఘకాలికంగా మొటిమలు, ఊబకాయం లాంటి అనేక రకాల హార్మోనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చదువుల్లో, ఆఫీసుల్లో ఉండే విపరీతమైన ఒత్తిడివల్ల విద్యార్థులు, ఉద్యోగులు దీని బారిన పడుతున్నారు. అయితే పీసీఓఎస్‌తో బాధపడేవారు డాక్టర్ చికిత్స తీసుకుంటూనే కొన్ని యోగాసనాలు సాధన చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అలా లాభించే యోగాసనాల్లో ఒక ఆసనమే పక్షిక్షికియ లేదా బటర్‌ఫ్లై ఈవారం...

పక్షిక్షికియ
ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. తరువాత రెండు పాదాలను మడిచి, ఒకదానికి దగ్గరికి మరొకటి తీసుకు రావాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకోవాలి. వీపు నిటారుగా ఉంచి, పొట్ట లోపలికి లాగి రెండు కాళ్లనూ పైకి, కిందకీ కదిలించాలి. ఇలా కాళ్లు పైకి వచ్చినప్పుడు మోచేతులకు ఆనించాలి. మళ్లీ కిందికి వెళ్లినప్పుడు భూమికి సమాంతరంగా ఉండేట్లు చూసుకోవాలి. ముందుగా 20 నుంచి మొదలుపెట్టి వందవరకు చేయవచ్చు. చివరగా గాలి పీల్చి వదిలేస్తూ తలను ముందుకు వంచి పాదాలను తాకేలా చూసుకోవాలి. అక్కడ కొన్ని సెకన్ల పాటు ఆగి... తరువాత గాలి పీల్చుకుంటూ యథాస్థానానికి రావాలి.
yoga
ఉపయోగాలు :
- ఈ ఆసనం వల్ల కటి భాగానికి ఎక్కువ ఎక్సర్‌సైజ్ అయి లోపల ఉన్న అవయవాలకు మంచి మసాజ్ ఇస్తుంది. దీంతో ఆయా భాగాలు చక్కగా పనిచేస్తాయి.
-కాళ్లకు శక్తినిస్తుంది.
-మోకాళ్ల నొప్పినుంచి ఉపశమనాన్నిస్తుంది.
-శరీరం తేలికగా తయారవుతుంది.
-పొత్తికడుపు దగ్గర అధికంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
-మధుమేహం, థైరాయిడ్ సమస్యలను కూడా నివారిస్తుంది.

జాగ్రత్తలు :
- ఇప్పటికే అధిక వెన్నునొప్పితో బాధపడుతున్నవారు చేయకపోవడం మంచిది.
-ఆరోగ్యంగా ఉన్నవారు సైతం అధిక శ్రమ పడకుండా సామర్థ్యం ఉన్నమేరకే చేయాలి!

గమనిక
- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

4190
Tags

More News

VIRAL NEWS