పిల్లల్లో నులిపురుగు సమస్యలా?


Tue,February 12, 2019 01:41 AM

Nuli-Purugulu
పిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య నులిపురుగులు. ఇవి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. అసలు ఇవి శరీరంలోకి ఎలా వెళ్తాయి? ఏ సమస్యలు కలిగిస్తాయి?


అపరిశుభ్రత వల్ల నులిపురుగులు వ్యాపిస్తాయి. 19 ఏళ్ల లోపు పిల్లలకు ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగుల్లోని పోషకాలన్నింటినీ తినేస్తాయి. ఎంత తిన్నాకూడా పోషకాహారం శరీరానికి అందదు. గోర్లు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల.. ఇంట్లో పాత్రలపై మూతలు పెట్టకపోవడం వల్ల తినేటప్పుడు ఆహారంతో పాటు నులిపురుగులు కడుపులోకి ప్రవేశిస్తాయి. ఇవి అటాక్ అయితే ఇక ఆకలి ఏ మాత్రం వేయదు. పిల్లలు బలహీనంగా మారిపోతారు. కడుపులో నొప్పి వస్తుంది. ముఖ్యంగా రక్త హీనత సమస్య మొదలవుతుంది. నులి పురుగులను నివారించే మందు ఆల్బెండజోల్. డాక్టర్ సలహాతో ఈ మందు వేసుకోవడం వల్ల పురుగులు చనిపోయి మలవిసర్జన ద్వారా బయటకు వస్తాయి.

997
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles