పిల్లలకు పోషకాహారం ఇవ్వండి!


Wed,June 6, 2018 10:45 PM

పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇక తల్లులకు ఒకే చింత పిల్లల లంచ్‌కు ఏం చేద్దామా అని. అయితే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పక్కా ప్రణాళికతో కూడిన లంచ్‌బాక్స్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆవెంటో ఈ వారం న్యూట్రిషన్ కాలమ్‌లో తెలుసుకుందామా?
Nutrian-Food
-పిల్లల లంచ్ బాక్స్‌లో కేలరీలు, ప్రొటీన్లతో కూడిన భోజనం ఉండాలి. దీనిని మూడు రోజులకు ఒకసారి మార్చుతూ ఉండాలి.
-లంచ్‌లో ఆకుకూరలను ఎక్కువగా చేర్చడం చాలా ఉత్తమం. ఎందుకంటే లంచ్‌లో 1/3 ఆకుకూరలు ఉండడం వల్ల అనేక విటమిన్లు, ఐరన్ పొందవచ్చు.
-పిల్లలకు కావల్సినంత భోజనాన్ని మొత్తం ఐదు గ్రూపులుగా ఉండేలా చూసుకోండి.
-నాణ్యమైన పాలు, పెరుగు, పండ్లు, పన్నీర్ వంటివి ప్రొటీన్‌ను మెరుగుపరుస్తాయి.
-కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాల్లో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
-వీటికితోడు అదనంగా ఓ గుడ్డును కూడా అందించండి.
-పిల్లలకు లంచ్‌బాక్స్ కట్టేముందు శుభ్రంగా కడిగిన గిన్నెలు ఆరేవరకూ ఆగండి. తడిగా ఉన్నప్పుడు కడితే భోజనం పాడయ్యే అవకాశం ఉంటుంది.
-అప్పుడప్పుడూ లంచ్ బాక్స్‌ను కూడా మార్చుతూ ఉండాలి.
-రోజూ ఇంటినుంచే నాణ్యమైన భోజనాన్ని పంపించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.

లంచ్ బాక్స్‌లో ఇవి చేర్చండి!

-వెజిటబుల్ పలావ్‌లోకి ఉడుకబెట్టిన గుడ్డును పెట్టండి. వీటితోపాటు పెరుగు/ఏదైనా పండును బాక్స్‌లో పెట్టండి.
-చపాతీలో ఏదైనా ఆకుకూర, ముద్దపప్పు, మజ్జిగ/పెరుగు చేర్చండి.
-కిచిడీలోకి పుదీనా/కొత్తిమీర పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది. దీనికితోడు మజ్జిగను మర్చిపోవద్దు.
-టమోట రైస్‌లోకి మజ్జిగ/పెరుగు, ఏదైనా పండు బాగుంటుంది.
-చపాతీతో పాటుగా ఆమ్లెట్‌ను చుట్టి లంచ్‌బాక్స్‌లో పెట్టండి. వీటితో పాటుగా ఓ పండును ఉంచండి.
-వెజిటబుల్ శాండివిచ్‌లోకి పన్నీర్ బాగుంటుంది. వీటితో పాటుగా ఓ పండును చేర్చండి.
-సోయాబీన్స్‌తో వెజిటబుల్ పలావ్ చేసి అందులోకి పెరుగును బాక్స్‌లో ఉంచండి. దీనికితోడు ఏదైనా ఓ ఫ్రూట్‌ను చేర్చండి.
-గోధుమరవ్వ, వెజిటబుల్స్‌తో చేసిన ఉప్మాలోకి పెరుగు, పుదీనా చట్నీ
బాగుంటాయి.
-పెరుగన్నంలోకి ఏదైనా ఓ పండును తినమని చెప్పండి. దీంతోపాటుగా కొత్తిమీర చట్నీని కూడా చేర్చండి.
dr-mayuri-aavula

2150
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles