పాపాయిల ష్యాషన్ ప్రపంచం


Fri,November 30, 2018 12:30 AM

fasition
ఎప్పుడూ పెద్దవాళ్ల ఫ్యాషన్ల గురించేనా? పిల్లల ఫ్యాషన్ మార్కెట్‌ని చూస్తే పెద్దలూనోరెళ్లబెట్టాల్సిందే! పెద్దవాళ్లకు ధీటుగా పిల్లల ఫ్యాషన్ ప్రపంచం పెరిగింది..
క్యూట్‌గా.. హ్యాపీ లుక్స్‌తో ఉండే చిన్నారులకు.. సపరేట్ స్టయిల్స్ క్రియేట్ చేయడం చాలెంజ్‌లాంటిదే! మరి వారికి డిఫరెంట్ స్టయిల్స్‌తో.. అదురగొట్టే ప్యాటర్న్‌లతో.. లాంగ్ కుర్తాలు.. పొట్టి పొట్టి గౌన్లను ఇస్తున్నాం.. మరి ఈ చిన్నారి ఫ్యాషన్ ప్రపంచాన్ని వీక్షించండి..

పెద్దలను అనుకరిస్తూ పిల్లలూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అలాంటిదే ఈ డ్రెస్! బ్లూ కలర్ పలాజో పాయింట్ ఇది. దీనికి మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన టాప్‌ని ఇచ్చారు. అది కూడా హాఫ్ షోల్డర్ నెక్‌తో అదరగొట్టేలా ఉంది.


తెల్లని లాంగ్ టాప్ ఇది. దీని మీద ఫ్లోరల్ పెయింట్, కుందన్స్ వచ్చాయి. దీనికి మ్యాచ్ అయ్యేలా ఆరెంజ్ కలర్ లాంగ్ లెంగ్త్, ఫుల్ స్లీవ్స్ కోట్ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. పీచ్ కలర్ లెహంగాని ఇవ్వడంతో మరింత బాగుందీ డ్రెస్.
fasition1
వైట్ అండ్ గ్రీన్ కలర్ చెక్స్ వచ్చిన కాటన్ ఫ్యాబ్రిక్ ఇది.
దీన్ని డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. పైన అడ్జెస్ట్ చేసుకునేలా బెల్ట్‌లు కూడా వస్తాయి. లోపల తెల్లని టీ షర్ట్ దీనికి పర్‌ఫెక్ట్‌గా సెట్టయింది.


మోడర్న్ లుక్‌తో మెరిసిపోయేందుకు ఈ డ్రెస్ వేయాల్సిందే! బ్లాక్ కలర్ ప్యాంట్, దాని చివరన వచ్చిన డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. దీనికి బ్లూ కలర్ షార్ట్ టీ షర్ట్, పై నుంచి ఫ్లోరల్, చెక్స్ ప్రింట్ వచ్చిన లాంగ్ స్లిట్ కుర్తా ఇవ్వడంతో సూపర్‌గా కనిపిస్తున్నది.

పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు చిన్నారులకు ఇలాంటి డ్రెస్ వేస్తే అదిరిపోతారు. బ్లూ కలర్ వర్టికల్ జరీ లైన్స్ వచ్చిన పొట్టి గౌన్ ఇది. దీనికి పైన కుచ్చుల్లా వచ్చాయి. సపరేట్‌గా వచ్చిన లాంగ్ కోట్ ఫుల్ స్లీవ్స్ మరింత ముచ్చటగొలుపుతున్నాయి.

664
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles