పాన్ కార్డు కొత్త నిబంధనలు


Sat,December 8, 2018 01:13 AM

ఈ నెల 5 నుంచి పాన్ కార్డు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. నిత్య జీవితంలో జరిపే ప్రతి ఆర్థిక లావాదేవీలకు తోడు ఐడీ కార్డుగా కూడా విరివిగా ఉపయోగిస్తున్న పాన్‌కార్డుకు సంబంధించి కొత్త నిబంధనలు తెలుసుకోవడం మన కర్తవ్యం. అవేంటో ఒకసారి చూద్దాం.
pand-card

తండ్రిపేరు తప్పని సరి కాదు

ఈ నెల 5 తర్వాత మీరు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే తండ్రిపేరు తప్పనిసరిగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దరాఖాస్తుదారు తల్లి సింగిల్ పేరెంట్ అయితే ఈ నిబంధన వర్తిస్తుంది. తల్లిపేరును ఇవ్వడానికి ఇప్పుడు దరఖాస్తుదారులకు అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి సీబీడీటీ నవంబర్18 నుంచి ఆదాయం పన్ను నిబంధనలను సవరించింది.

వ్యక్తిగతేతర సంస్థలు పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు

2018 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చట్టంలోని 139ఏ సెక్షన్‌ను సవరించారు. దీని ప్రకారం రూ. 2.5 లక్షలకు పైబడి లావాదేవీలు జరిపే సంస్థాగత లావా దేవీలకు పాన్ కార్డు తప్పనిసరి. ఈ నిబంధన ఏప్రిల్1, 2018 నుంచే అమలులోకి వచ్చింది. అయితే ఎప్పటి లోగా పాన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలో ప్రస్తావించలేదు. తాజాగా 114 నిబంధనను సవరించడం ద్వారా మే 31, 2019 లో పాన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన కూడా ఈ నెల 5 నుంచే అమల్లోకి వచ్చింది. వీరంతా మే 31 లోగా పాన్ కార్డును పొందాల్సి ఉంటుంది. అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యుఎఫ్) లేదా మరే ఇతర సంస్థ రూ. 2.5 లక్షలకు మించి లావాదేవీలు జరిపితే పాన్ తప్పని సరి.

నాలుగు గంటల్లోనే పాన్ కార్డు

కేవలం నాలుగు గంటల్లోనే పాన్‌కార్డును పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అనేక రకాలుగా ఆటోమేషన్ చర్యలను చేపడుతున్నారు. పన్నుల ముందస్తు చెల్లింపులు, ఆదాయపు పన్ను రిటర్నులు, కేస్ సెలక్షన్ వంటి అనేక అంశాలను వచ్చే ఏడాది నుంచి ఆటోమేషన్ చేయనున్నారు.

516
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles