పాదాల పగుళ్లకు..


Fri,December 14, 2018 12:44 AM

చలికాలం వచ్చిందంటే పాదాలు పగిలి తీవ్రమైన నొప్పితో నడువడానికి బాధపడుతుంటారు. దీనికి చక్కటి పరిష్కారం అరటిపండు గుజ్జు. ఈ కింది చిట్కాలు పాటిస్తే కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు.
footcare
-అరటిపండును మెత్తగా చెయ్యాలి. పాదాల పగుళ్లకు అరటిగుజ్జు రాయాలి. 30 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే పాదాల మీది ముడుతలు తొలిగిపోతాయి.
-తేనెకు యాంటీ యాక్సిడెంట్స్ గుణాలున్నాయి. తేనెను ప్రతిరోజూ నిద్రించే ముందు పాదాల పగుళ్లకు రాయాలి. తరువాత రోజు ఉదయాన్నే చల్లని నీటితో కడుగాలి. ఇలా చేస్తే పాదాలు మృదువుగా మారుతాయి.
-బియ్యంపిండి, తేనె, ఆపిల్ సిడర్ వెనిగర్ మూడింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి.
-వేపాకు పేస్ట్, సున్నం బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించాలి. 15 నిమిషాల తరువాత స్క్రబ్ చేసి కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే పాదాలు మెత్తగా ఉంటాయి.
-పొప్పడిగుజ్జు, ఆలూ పొడి, మెంతికూర గుజ్జు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పూతలా వేయాలి. 20 నిమిషాల తరువాత కడుగాలి. తరచూ ఇలా చేస్తే పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

555
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles