పాదాలు దుర్వాసనా?


Mon,August 20, 2018 11:19 PM

వానాకాలంలో షూ వేసుకునప్పుడు గాలి ఆడక సాక్స్ దుర్వాసన వస్తుంటాయి. దీంతో పక్కనున్నవారు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే, నిమ్మకాయ, తేనెలను వినియోగించి దుర్వాసనను తరిమికొట్ట్టచ్చు.
foot-care
-నిమ్మకాయ, ఆలివ్ ఆయిల్‌ను బాగా కలిపి తేనె, చక్కెరను వేసి మిశ్రమంలా తయారుచేసి, పాదాలకు మర్దన చేయాలి. కొద్దిసేపటి తర్వాత పాదాలను గోరువెచ్చని నీటిలో 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే దుర్వాసన రాదు.
-పాదాలను ఎప్పుడూ పొడిగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇంటిలోనే ప్రతిరోజు పెడిక్యూర్ చేయండి. ఇలా చేయడం వలన పాదాలు శుభ్రంగా ఉంటాయి.
-చెప్పులు వేసుకొనేటప్పుడు అవి శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. చెప్పులు విప్పిన వెంటనే అల్మారాల్లో పెట్టకుండా గాలి తగిలే ప్రదేశంలో ఉంచండి.
-పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఫంగల్ పౌడర్‌ను ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల పాదాలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు, దుర్వాసనకు దూరంగా ఉంటాయి.

606
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles