పసిపిల్లలకు స్నానం ఇలా!


Tue,August 14, 2018 01:23 AM

baby-bathing
పసిపిల్లల స్నానం విషయంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల పలు సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. అవి ఏంటో తెలుసుకుని జాగ్రత్త వహించండి.

-అప్పుడే పుట్టిన బిడ్డకు వెర్నిక్స్ కాసియోసా అనే మైనం లాంటి పదార్ంధ శరీరమంతా పూతలా ఉంటుంది. ఈ వెర్నిక్స్ పసిపిల్లల చర్మానికి హాని కలిగించే క్రిములు, వాతావరణ కాలుష్యం నుంచి రక్షణ ఇస్తుంది. బిడ్డ పుట్టిన ఆరు గంటల తరువాత స్నానం చేయించాలి. పుట్టిన వెంటనే స్నానం చేయించకూడదు.
-పసిపిల్లల చర్మం చాలా పలుచగా, సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ సార్లు స్నానం చేయించకూడదు. వారంలో నాలుగు సార్లు చేయిస్తే సరిపోతుంది. స్నానం చేయించాక మెత్తని టవల్‌తో శుభ్రంగా తుడవాలి. స్నానం రాత్రి పూట చేయించడం మంచిది.
-మార్కెట్లో దొరికే రకరకాల సబ్బులను పసి పిల్లలకు వాడకూడదు. సబ్బులను మార్చకుండా ఒకే బ్రాండ్‌ని ఎంచుకొని వాటినే కొనసాగిస్తే మంచిది. వైద్యులను సంప్రదించి ఎలాంటి సబ్బును వాడాలో తెలుసుకొంటే మరీ మంచిది.
-స్నానం గోరువెచ్చని నీటితోనే చేయించాలి. నీరు ఎక్కువ చల్లగా ఉండకూడదు. అలాగని నీరు ఎక్కువ వేడిగా ఉన్న చర్మంపై దొద్దులు, రాషెష్ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. పసిపిల్లల స్నానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
-తల్లి నుంచి బిడ్డ వేరయినప్పుడు బొడ్డుతాడును కత్తిరిస్తారు. ఆ తాడు కొన్నిరోజుల వరకు బిడ్డకు అలాగే ఉంటుంది. స్నానం చేయించేటప్పుడు బొడ్డు దగ్గర ఎక్కువ రుద్దకూడదు. దానంతట అది ఊడేవరకు మనం ఏమీ చేయకూడదు. స్నానం చేయించేటప్పుడు తాడు దగ్గర చాలా సున్నితంగా వ్యవహరించాలి. పసిపిల్లల స్నానం విషయంలో ఈ పద్ధతులను పాటించడం వల్ల ఎలాంటి సమస్యలూ రాకుండా ఉంటాయి.

422
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles