పవర్ పేపర్ రెడీ!


Tue,August 21, 2018 01:03 AM

పదార్థ శాస్త్రం

Padartha-shastram
పవర్ పేపర్లలో నిలువ చేసిన విద్యుచ్ఛక్తిని వాహనాలు, గృహాలు, పరిశ్రమల వంటి వాటికి సరఫరా చేసుకొనే రోజులు రానున్నాయని నిపుణులు అంటున్నారు.
ఒక కాగితంలో శక్తి (విద్యుచ్ఛక్తి)ని నిలువ చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు నిరూపించారు. అటువంటి పవర్ పేపర్‌ను అభివృద్ధి పరిచారు కూడా. స్వీడన్‌లోని లింకోపింగ్ యూనివర్సిటీకి చెందిన లాబొరేటరీ ఆఫ్ ఆర్గానిక్ ఎలక్ట్రానిక్స్ పరిశోధకులు ఇలాంటి కాగితాన్ని పోలిన ఒక కొత్త పదార్థాన్ని సృష్టించారు. దీనిని నానోసెల్యులోస్ (వామనకణాలు), కండక్టివ్ పాలీమర్‌లతో రూపొందించినట్లు వారు తెలిపారు. ఇదొక ప్లాస్టిక్ కాగితంలానే ఉంటుంది. సంప్రదాయేతర ఇంధనాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి నవీన శక్తి నిల్వ పదార్థాల అవసరం ఉంది. అడ్వాన్స్‌డ్ సైన్స్ ఆన్‌లైన్ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధనకు చెందిన ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి నిపుణులు 2012 నుంచే కృషి చేస్తున్నారు. ఈ పవర్ షీట్‌ను ప్రయోగ స్థాయిలో 1 మి.మీ.లో కొన్ని పదుల వంతు మందం, 15 సెం.మీ. చుట్టుకొలతతో తయారుచేశారు. ఈ షీట్ తేలికైన బరువుతోనే ఉంటుంది. ఇందులో విద్యుచ్ఛక్తిని కొన్ని వందల సార్లు రీచార్జి చేయవచ్చునని వారంటున్నారు.

1439
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles