పర్‌ఫెక్ట్ పరికిణీలు


Fri,August 17, 2018 01:39 AM

పెండ్లిండ్లు మొదలయ్యాయి..పండుగలు ప్రారంభమయ్యాయి.. సాంప్రదాయాన్ని.. ఆధునికతను సమపాళ్లలో నిలబెట్టాలంటే ఈ రెండు సందర్భాలకు పరికిణీలే పర్‌ఫెక్ట్.. పదహారణాల లంగా-ఓణీలు కట్టి.. పడుచులు వడివడిగా తిరుగుతుంటే.. ఆ అందమే వేరు.
మరి ఆ పరికిణీలు కేవలం యువతరం కోసమే కాదు.. అన్ని వయసుల వారికి బాగుంటాయి.

Roja
1. సీ గ్రీన్ కలర్ సిల్క్ లెహంగా ఇది. దీనిమీద సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. దీనికి గోల్డెన్ బార్డర్స్‌తో పాటు, సీక్వెన్స్ బార్డర్‌ని జత చేశాం. సీ గ్రీన్ కలర్ రాసిల్క్ బ్లౌజ్ మీద హెవీ స్టోన్ వర్క్ చేయించాం. ఆరెంజ్ కలర్ షిఫాన్ బాందినీ ఓణీకి గోల్డెన్ బార్డర్ జతచేయడం అదనపు ఆకర్షణగా నిలిచింది.

2. బుట్ట బొమ్మలా మెరిసేందుకు ఈ పరికిణీ కట్టాల్సిందే! ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన సాటిన్ లెహంగా ఇది. దీనికి రాసిల్క్ బ్లూ బార్డర్ మీద హెవీగా ఎంబ్రాయిడరీ చేయించాం. దీనికి సీక్వెన్స్ బార్డర్‌ని జతచేయడంతో మరింత మెరిసిపోతున్నది. బ్లూ కలర్ రాసిల్క్ బ్లౌజ్‌ని హై నెక్, ఫుల్‌స్లీవ్స్‌తో డిజైన్ చేశాం. దీనిమీద స్టోన్, జర్దోసీ, జరీ వర్క్‌తో హెవీగా నింపేశాం. అక్కడక్కడ బుటీస్‌తో నింపేశాం. బ్లూ కలర్ షిపాన్ దుపట్టాకి కూడా హెవీ వర్క్ బార్డర్ ఇచ్చి.. అక్కడక్కడ బుటీలతో నింపేయడం డ్రెస్ అందాన్ని రెట్టింపు చేసింది.
Roja1
3. యెల్లో కలర్ నెట్ లెహంగా ఇది. దీన్ని ఎక్కువ ఫ్లేర్ వచ్చేలా డిజైన్ చేశాం. దీనికి పర్పుల్ కలర్ రాసిల్క్ బ్లౌజ్‌ని ఎంచుకున్నాం. దీనిమీద థ్రెడ్, జర్దోసీలతో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ చేయించాం. సీ గ్రీన్ కలర్ షిఫాన్ దుపట్టాకి గోల్డెన్ బార్డర్ ఇవ్వడంతో మరింత అందంగా
మెరిసిపోతున్నది.

4. కాంట్రాస్ట్ కాంబినేషన్ ఎప్పుడూ అదుర్సే. ఆ కాంబినేషన్‌లో ఈ పరికిణీ డిజైన్ చేశాం. పింక్ కలర్ బెనారస్ కలీ లెహంగా ఇది. దీనికి జర్దోసీ, స్టోన్స్‌తో వచ్చిన గోల్డెన్ బార్డర్ జతచేశాం. ఆరెంజ్ కలర్ రాసిల్క్ బ్లౌజ్ మీద గోటా పట్టీ ఎంబ్రాయిడరీ చేయించాం. ఆరెంజ్ కలర్ షిఫాన్ దుపట్టాకి కూడా గోల్డెన్ బార్డర్ ఇవ్వడంతో సూపర్ లుక్ వచ్చింది.

ఫిరోజ్ & అమ్ము
ఫ్యాషన్ డిజైనర్స్
ఫిరోజ్ డిజైన్ స్టూడియో
https://www.facebook.com/firozdesignstudio/
హైదరాబాద్
ఫోన్ : 8142049755, 9505340228

546
Tags

More News

VIRAL NEWS