పర్యాటక ప్యాకేజీలు


Fri,July 27, 2018 12:55 AM

వివిధ పుణ్యక్షేత్రాలు, సందర్శన స్థలాలను చూపించే ప్యాకేజీలను మన ఆర్టీసీలోనూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. త్వరలోనే ప్యాకేజీ టూర్ పేరిట పైలెట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి రీజియన్‌లో ప్రత్యేక ప్యాకేజీలను ప్రారంభించనున్నది. ఇందులో భాగంగా వారాంతాల్లో(వీకెండ్స్) పికెట్ డిపో నుంచి భద్రాచలం, శ్రీశైలం, వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు 18 సీటర్ల వజ్ర ఏసీ బస్సులను నడుపనున్నది.
vajra

ప్యాకేజీ టూర్

ఈ ప్యాకేజీ టూర్‌లో భాగంగా రంగారెడ్డి రీజియన్ పరిధిలోని హైదరాబాద్-1 డిపో నుంచి వేములవాడ, బాసర, కొమురవెల్లి, హైదరాబాద్-2 డిపో నుంచి బాసర, సోమశిల, అనంతగిరి, హైదరాబాద్-3 డిపో నుంచి శ్రీశైలం, ప్రత్యేకంగా యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట (సురేంద్రపురి, కొలనుపాక)లకు సర్వీసులను ప్రారంభించనున్నారు. కాగా, పికెట్ డిపో నుంచి రెండు రోజులపాటు ఉండే ప్యాకేజీలో భద్రాచలం పుణ్యక్షేత్రంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని పాపికొండలు(బోటింగ్), పర్ణశాల, కిన్నెరసాని డ్యామ్‌లను ప్రయాణికులకు చూపించనున్నారు. ఇదే విధంగా రెండు రోజుల శ్రీశైలం ప్యాకేజీలో భాగంగా ఉమా మహేశ్వరం, ఫర్హాబాద్(టైగర్ సఫారీ), శ్రీశైలం డ్యామ్, పాలధార, పంచధార, సాక్షి గణపతి, హటకేశ్వరం, పాతాళగంగ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలను చూపించనున్నారు. కాగా, ఒకేరోజు ప్యాకేజీ కింద వరంగల్, హన్మకొండ, భద్రకాళి దేవాలయం, లక్నవరం లేక్, రామప్ప దేవాలయం, వెయ్యి స్తంభాల దేవాలయాలను చూపించాలని భావిస్తున్నారు.


అందుబాటులోగైడ్ కూడా..

రెండు రోజులపాటు భద్రాచలం, శ్రీశైలం ఒకరోజుపాటు వరంగల్ ప్రాంతాల సందర్శనార్థం తీసుకెళ్లనున్న ప్రత్యేక ప్యాకేజీ బస్సుల్లో ఆయా స్థలాల పట్ల అవగాహన కల్పించడం కోసం గైడ్‌నూ అందుబాటులో ఉంచనున్నారు. ఈ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలనుకునేవారు టీఎస్‌ఆర్టీసీఆన్‌లైన్.ఇన్ వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. మరిన్ని వివరాల కోసం అధికారులను సంప్రదించవచ్చు.

875
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles