పరుగెత్తింది.. మారింది


Fri,May 19, 2017 11:12 PM

నువ్వెప్పుడూ నీ గెలుపు కోసమే పరుగెత్తు. ఒకరి ఓటమి కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంటపడుతాడు. వాడు ఎప్పుడూ వెనుకే ఉంటాడు. గెలువాలనుకునేవాడు ముందుంటాడు.ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు.గెలువడం అంటే ఓడించడం కాదు.పరుగు ఎప్పుడూ అందంగానే ఉంటుంది. బతుకడం, పరుగెత్తడం రెండూ ఒక్కటే. అందుకే పరుగులో జీవితాన్ని వెతుక్కున్నది అను ప్రియా. పరుగు మొదలుపెట్టింది. జీవితాన్ని మార్చుకున్నది. అమ్మతనం.. మాటల్లో వర్ణించలేని, అక్షరాల్లో ఇమడ్చలేని గొప్ప వరం. ఆ వరం కేవలం మహిళలకు మాత్రమే. కానీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ అమ్మ భరించే వేదన, పడే పురిటినొప్పుల బాధ ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని రుణం. తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఏడుగురిలో ఒకరికి మానసికంగా కృంగిపోయే వ్యాధి వస్తుందట. ఆ వ్యాధి అనుప్రియాకు కూడా వచ్చింది.
anupriya
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఆందోళనకు గురయ్యేవాళ్ల సంఖ్య మహిళల్లో ఎక్కువ ఉంటుంది. సంవత్సరానికి సుమారు ఏడుకోట్ల మూడు లక్షల మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు కూడా వెల్లడయింది. ప్రపంచవ్యాప్తంగా 13శాతం మంది మహిళలు ప్రసవానంతరం మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు.

ఇప్పుడు అనుప్రియాను చూసినవారు ఈమేనా.. ప్రసవానంతరం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది? అని ఆశ్చర్యపోతారు. కానీ ఆమె గతం గురించి తెలుసుకుంటే మాత్రం ఆమె మీద, అమ్మతనం మీద గౌరవం పెరుగుతుంది. అందరిలాగే అనుప్రియాకు కూడా పురిటినొప్పులొచ్చాయి. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ప్రసవం అయింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏదో తెలియని ఆందోళన. బాధ, ఏదో కోల్పోయినతనం, ఎప్పుడు చూసినా పడుకునే ఉండేది. మెలకువతో ఉంటే.. ఎవరో ఒకరిమీద అరిచేది కోప్పడేది. డాక్టర్లను సంప్రదిస్తే.. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నదని చెప్పారు. ఈ వ్యాధి నుంచి ఆమె కోలుకోవాలంటే పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈలోపు రెండేళ్లు గడిచిపోయాయి. అనుప్రియా మెల్లగా కోలుకుంటున్నది. రోజుకు ఇరవై నిమిషాలు యోగా, గంటసేపు రన్నింగ్ చేసేది. అలా ప్రతిరోజూ రన్నింగ్ చేయడం అలవాటైంది అనుప్రియాకు. ఆ తర్వాత రన్నింగ్ వల్ల ఉపయోగమేంటో అర్థమైంది. యోగా, రన్నింగ్ ఆమె ఆరోగ్యాన్ని పూర్తిగా కోలుకునేలా చేశాయి. ఇప్పటికే ఆమె రెండు ఫుల్ మారథాన్‌లు, లెక్కలేనన్ని హాఫ్ మారథాన్‌లు, టెన్‌కే మారథాన్లు పూర్తి చేసింది.రన్నింగ్ వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. అవి మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుందంటున్న అనుప్రియా, 2015లో బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేసింది. అందులో తన అనుభవాలన్నింటినీ పోస్ట్ చేస్తున్నది.
anu

లక్షణాలు


ప్రసవానంతరం డిప్రెషన్‌లో ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
- చిన్న విషయాలకు ఆందోళన చెందడం
- ప్రతిదానికి బాధపడఢం
- మానసికంగా కుంగిపోవడం
- నిద్రలేమి సమస్య - ఆకలి లేకపోవడం
- కారణం లేకుండా ఏడుపురావడం
- నిస్సహాయత

782
Tags

More News

VIRAL NEWS