పరిశుభ్రతపై చైతన్యం..!


Sat,December 15, 2018 01:03 AM

ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఈ ఇద్దరు చేస్తున్న కృషిని కచ్చితంగా అభినందించాల్సిందే. చెత్త రీసైక్లింగ్ దగ్గర్నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా మహిళల రుతుక్రమ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Menstrual-Cups
బెంగళూర్‌కు చెందిన ద్వయం మాలిని పర్మార్, స్మిత కులకర్ణి. వీరిద్దరూ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై కొన్నేండ్లుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను మళ్లీ ఎరువుగా ఉపయోగించుకునేలా శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటుగా ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యం, వనరుల నిర్వహణపై ప్రజలకు చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు రుతుక్రమం సమయంలో వినియోగిస్తున్న శానిటరీ ప్యాడ్స్ వల్ల పర్యావరణం దెబ్బతింటుంన్నదని.. ఈ సమస్యకు పరిష్కారంగా మహిళలు మెనుస్ట్ట్రువల్ కప్స్ వాడాలని సూచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా స్టోన్‌సాస్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. దీని ద్వారా నాణ్యమైన కప్స్‌ను తయారు చేసి, అతి తక్కువ ధరకే మహిళలకు అందిస్తున్నారు. అంతేకాకుండా వీటి వాడకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీటి ధర రూ.500 నుంచి మొదలవుతుంది. ఒక్కసారి కొనుగోలు చేస్తే.. దాదాపు పదేండ్ల వరకూ వాడుకోవచ్చు. దీని వల్ల డబ్బు ఆదాతో పాటు.. ఆరోగ్యంగా ఉంటారని స్మిత, మాలిని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా మెనుస్ట్రువల్ కప్స్ వాడేలా ప్రోత్సహిస్తున్నామని, అందుకు చాలామంది సహకరిస్తున్నారని చెబుతున్నారు. లాభాలు ఆశించకుండా ప్రజారోగ్యంపై వీరిద్దరూ తీసుకుంటున్న శ్రద్ధ అమోఘం. పలువురు వీరు చేస్తున్న సేవను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

410
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles