పరిమిత కెఫిన్ మంచిదే!


Sat,December 15, 2018 01:02 AM

కెఫిన్లో నొప్పిని తట్టుకునే శక్తి ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అలబామా యూనివర్సిటీలోని సైకోఫార్మకాలజీ విభాగానికి చెందిన పలువురు ప్రొఫెసర్లు ఈ స్టడీ నిర్వహించారు. కెఫిన్ వాడకాన్ని బట్టి నొప్పిని భరించే శక్తిలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నట్టు వారు తేల్చారు.
Coffe-Study
ఈ అధ్యయనం కోసం 19-77 యేండ్ల మధ్య వయసు గల 62 మందిని ఎంపిక చేశారు. కాఫీ, టీ, సోడా, చాక్లెట్, ఇతర ఎనర్జీ డ్రింక్స్ వినియోగాన్ని బట్టి కెఫిన్ ప్రభావాన్ని రికార్డు చేశారు. వారంతా సగటున రోజుకు 170 మిల్లీగ్రాముల కెఫిన్ (ఓ రెండు కప్పుల కాఫీతో సమానం)ను వినియోగిస్తున్నారు. అందులోని 15 శాతం మంది రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్ వాడుతున్నారు. వారం రోజుల తరువాత వారిని ఓ ల్యాబొరేటరీకి తరలించి అందరినీ నొప్పికి గురి చేశారు. మోచేతి/వెన్నుకు క్యాలిబ్రేటెడ్ డివైస్‌ను అమర్చి ప్రెజర్‌ను పెంచి వారి ఫీలింగ్స్ రికార్డు చేశారు. మామూలు నొప్పి అనిపించినప్పుడు బటన్‌ను ప్రెస్ చేయడం, నొప్పి భరించలేనంత పెరిగినప్పుడు రెండోసారి బటన్ ప్రెస్ చేయడం ద్వారా నొప్పి భరించే స్థాయిల్లో తేడాలను నమోదు చేశారు. ఇదే పరీక్షను సెక్స్, రేస్ పోటీలు, టుబాకో వినియోగం, ఆల్కహాల్ వాడకాల పరిమితులను బట్టి కూడా నొప్పి భరించే సామర్థ్యాన్ని రికార్డు చేశారు. అయితే, కెఫిన్ వాడుతున్న వారు నొప్పిని కాస్త ఎక్కువగా భరిస్తున్నారని తేలింది. అంతిమంగా వారు చెబుతున్నదేంటంటే మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారిలో నొప్పి భరించే శక్తి ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారణ చేశారు.

423
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles