పన్ను మినహాయింపులివ్వాలి


Sat,August 4, 2018 01:24 AM

gift
మహిళలకు బహుమతులపై స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళలు అందుకునే బహుమతులపై పన్ను మినహాయింపునివ్వాలన్నదానిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నది. స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేయగా, ఆదాయం పన్ను (ఐటీ) చట్టాన్ని సవరించాలని కోరింది. ఈ క్రమంలోనే స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వీరేంద్ర కుమార్ సంబంధిత వివరాలను రాజ్యసభకు తెలియజేశారు. అంతకుముందు జేడీ(ఎస్) సభ్యుడు డీ కుపేంద్ర రెడ్డి.. తమ సమీప, సన్నిహిత బంధువుల నుంచి పొందిన బహుమతులపై పన్నుల నుంచి మినహాయింపు కోసం మహిళల నుంచి విజ్ఞప్తులు అందాయా? లేదా? అని ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. ఈ క్రమంలోనే ఈ అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నదని సభకు వివరించారు.

186
Tags

More News

VIRAL NEWS