పన్నీర్‌తో లాభాలు!


Wed,December 5, 2018 01:05 AM

పన్నీర్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అంతేకాకుండా పన్నీర్ ఇన్‌ఫెక్షన్స్‌ని తొలిగిస్తుంది. పన్నీర్‌తో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే చాలా లాభాలున్నాయి.
paneer
అవేంటో చూద్దాం.
-కోడిగుడ్డు తెల్లసొన, తేనె, పసుపు, పన్నీర్ పేస్ట్ వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 30 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మంపై ముడుతలు పోతాయి. ఈ పేస్ట్‌ని 20 రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో నిలువ ఉంచవచ్చు.
-పన్నీర్ పేస్ట్‌లో కొంచెం బాదం నూనె, గ్లిజరిన్, నిమ్మరసం కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
-టమోటాని మెత్తని గుజ్జులా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే జిడ్డు సమస్య నుంచి బయటపడొచ్చు.
-మీగడలో కొంచెం చక్కెర, కలబంద గుజ్జు కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 40 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మంపై మృతకణాలు పోతాయి.
-పసుపులో కొంచెం కమలాపండు రసాన్ని కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు పోతాయి.

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles