పనితనం


Tue,September 4, 2018 02:56 AM

Panitanam
పాలను పెరుగుగా మార్చడం వెనుక లాక్టోబాసిల్లస్ (lactobacillus) అనే సూక్ష్మక్రిముల పనితనం ఆశ్చర్యకరం. కొంచెం పాత పెరుగును గోరు వెచ్చటి పాలలో కలిపిన కొద్ది గంటలలోనే పెరుగు తయారవుతుంది. సామాన్యులకు ఇదొక రహస్యం. ఆ కాసింత పెరుగులోని సూక్ష్మక్రిములు తక్షణం విజృంభించి, పాలలోని చక్కెర పదార్థాన్ని (లాక్టోజ్) తినేస్తూ అంతకంతకూ పెంపొందుతాయి. లాక్టోజ్ నుంచి ఎటిపి (Adenosine triphosphate-ATP) గా పిలిచే శక్తిని అవి ఉత్పత్తి చేయడం వల్ల పాలు కాస్తా మొత్తంగా లాక్టికామ్లంగా మారుతుంది. పాలలోని కేసిన్ అనే ప్రొటీన్స్‌కు పైన- పేర్కొన్న లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాకు మధ్య సంభవించే రసాయన చర్యగా దీనిని పేర్కొంటారు. ఈ విధానాన్ని పులియ బెట్టడం గానూ పిలుస్తారు. చిక్కటి, తియ్యటి పెరుగు రుచి అమోఘం. ఐతే, ఈ సూక్ష్మక్రిములు మనకు మేలు చేసేవే తప్ప కీడు చేయవు.

493
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles