పచ్చబొట్టే ఉపాధి!


Sat,August 11, 2018 02:33 AM

పచ్చబొట్టు పొడిపించుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావని కొందరు వాటికి దూరంగా ఉంటున్నారు. బహుళజాతి కంపెనీలు కూడా టాటూస్‌ను సీరియస్‌గా తీసుకోవడంతో ఉద్యోగం చేసేవాళ్లు టాటూ అంటేనే జడుసుకుంటున్నారు. అయితే కొన్ని ఉద్యోగాల్లో ఆకర్షణీయమైన పచ్చబొట్టు ఉంటేనే ఉద్యోగం ఇస్తున్నారు.
Tattoo-Job
పచ్చబొట్టు కొందరికి ఫ్యాషన్. మరికొందరికి చెరగని జ్ఞాపకం. ఇంకొందరికి ఉద్యోగ శాపం. పచ్చబొట్టు ఉండటం వల్ల ఉద్యోగావకాశాలు కోల్పోయిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఇది అన్ని విభాగాల్లో లేదని చెప్తున్నారు నిపుణులు. యువతలో టాటూస్‌కు ఉన్న ఆదరణ.. ఉద్యోగాల్లో పెడుతున్న నిబంధనల నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన మియామి బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా పరిశోధకులు అధ్యయనం చేశారు. రోజువారీ.. నెలవారీ జీతాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవాళ్లకు ఈ నిబంధనలేవీ అడ్డురావడం లేదనీ.. మాల్స్ వంటి వాటిల్లో చేసే ఉద్యోగాలు ఇలా టాటూస్ ఉండి ట్రెండ్‌ను ఫాలో అయ్యే యువతనే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. సౌందర్య రంగంలో అయితే టాటూస్ లేనివాళ్లను వింతగా చూస్తారట. అట్రాక్టివ్‌గా ఉండటమే కాదు.. వ్యక్తి స్వభావాన్ని తెలపడంలో ఈ టాటూస్ ఉపయోగపడి మేనేజ్‌మెంట్స్‌కు కూడా నియామకాల విషయంలో సమస్యలు రావడం లేదని వాళ్లు వివరించారు.

276
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles