పచ్చదనమే ప్రాణంగా..


Sat,August 11, 2018 02:44 AM

మైథిలి ఫణికర్ ఓ చిత్రకారిణి, డిజైనర్ కూడా. పిల్లల కోసం ప్లే స్టేషన్ తయారు చేసే ఓ ప్రాజెక్ట్ ఆమె చేతికి వచ్చింది. అక్కడ సహజ సిద్ధంగా ఉండే మొక్కలతో ఆ ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాలని చెప్పారు. అలా గార్డెనింగ్ మీద పెరిగిన ఆసక్తి ఇప్పుడు తన అపార్ట్‌మెంట్‌ని అల్లుకుంది.
Maithili-Panikar
మైథిలీ పణికర్.. కొచ్చిలో నివాసముంటుంది. బెంగళూరులోని సృష్టి స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో డిజైన్ అండ్ టెక్నాలజీ చేసింది. గార్డెన్ సిటీని చూసిన ఆమెకు పచ్చదనం మీద ప్రేమ పెరిగింది. ఆమె తల్లి బిందు కూడా ప్రకృతి ప్రేమికురాలు. మైథిలీకి చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ మీద ఆసక్తి పెరుగడానికి ఒక రకంగా తల్లి కారణం. అయితే పెరుగుతున్న కొద్దీ కాంక్రీట్ జంగిల్‌లో బతుకాల్సి రావడం, చదువులపై ఫోకస్‌తో గార్డెనింగ్‌ని పక్కన పెట్టింది. కానీ ఆమెకు వచ్చిన ఒక ప్రాజెక్ట్ ఆమె చుట్టూ పచ్చదనం మళ్లీ అల్లుకునేలా చేసింది. చదువు పూర్తయ్యాక కొచ్చి వచ్చి సెటిల్ అయింది ఫ్యామిలీ. అపార్ట్‌మెంట్‌లో కామన్‌గా ఉండే ఏరియాను ఎంచుకొని అక్కడ గార్డెన్ ఏర్పాటు చేయాలనుకుంది. కమ్యూనిటీ వాళ్లతో మాట్లాడి తల్లితో కలిసి ఆ మంచి పనికోసం శ్రీకారం చుట్టింది. ఆకుకూరలు, కూరగాయలు, ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఈ గార్డెన్‌లో ఉన్నాయి. కేవలం ఆవరణలోనే కాకుండా.. టెర్రస్ పైన రకరకాల అలంకరణ మొక్కలనూ పెంచుతున్నది. ఇవన్నీ కూడా ఎలాంటి రసాయనాలు వాడకుండా.. ఇంటి దగ్గరే ఎరువును తయారు చేసి మరీ ఈ పని చేపట్టారు ఈ తల్లీకూతుళ్లు. మైథిలీ ఈ పచ్చదనం ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫొటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అంతేకాదు.. ఆమెను ఆదర్శంగా తీసుకొని కొచ్చీలో ఎంతోమంది ఇలాంటి గార్డెన్‌లను పెంచడం మొదలు పెట్టారట.

259
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles