న్యూరోపతికి హోమియో బెస్ట్


Wed,June 10, 2015 02:45 AM

homeopathy

జీవితంలో పెరిగిన వేగం, తదనుగుణంగా మారిన జీవన శైలీ, పెరిగిన ఒత్తి వెరసి మధుమేహానికి కారణమవుతున్నాయి. మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం పాంక్రియాస్. ఇది శరీరానికి ఇన్సులిన్‌ను చేయకపోయినా లేక ఉత్పతిత అయిన ఇన్సులిన్‌ను శరీరంలోని కణాలు గ్రహించలేకపోయినా మధుమేహ సమస్య వస్తుంది. మధుమేహం వల్ల అనేక రకాలైన దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంటుంది. అందులో ముఖ్యంగా గుండె సమస్యలు, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి. డయాబెటిక్ న్యూరోపతి ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. సుమారు 60 నంచి 70 శాతం దీర్ఘకాలిక మధుమేహ వ్యాధిగ్రస్తులలో గ్లూకోజ్ శాతం నియంత్రణలో లేకపోవడం వల్ల డయాబెటిక్ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంది.

డయాబెటిక్ న్యూరోపతి రకాలు


మధుమేహుల్లో కనిపించే డయాబెలిక్ న్యూరోపతి 4 రకాలుగా కనిపిస్తుంది. ఇవి వరుసగా పెరీఫెరల్ న్యూరోపతి, అటనామిక్ న్యూరోపతి, ప్రాక్సిమల్ న్యూరోపతి, ఫోకల్ న్యూరోపతి. వీటిలో పెరీఫెరల్ న్యూరోపతి ఎక్కువ మందిలో కనిపిస్తుంది.

లక్షణాలు


కాళ్లు దిమ్ము పట్టినట్లు ఉండడం, మొద్దు బారడం, సూదులు గుచ్చినట్లు ఉండడం అరికాళ్లలో మంట, కాళ్లలో బలహీనత, కాళ్లకండారాలలో నొప్పి, కడుపుబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, ఛాతిలో మంట, వికారం, వాంతులు, గుండెదడ, అధిక మూత్ర విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం, లైంగిక పరమైన సమస్యలు రావడం, చేతుల్లో తిమ్మిర్లు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిర్ధారణ


లక్షణాల తీవ్రత పరిశీలించి తద్వారా వ్యాధిని నిర్ధారించేందుకు కొన్ని శారీరక పరీక్షలు అవసరమవుతాయి. ముఖ్యంగా కళ్లలోని స్పర్శజ్ఞానం, కండరాల పటుత్వం రిఫ్లెక్సెస్ వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించబడుతుంది. రక్తంలో చెక్కెర స్థాయి, ఫిలమెంట్ టెస్ట్ వంటి పరీక్షల ద్వారా కూడా వ్యాధిని నిర్ధారించవచ్చు.

హోమియో చికిత్స


srikanth

డయాబెటిక్ న్యూరోపతి సమస్యకు జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో చికిత్స అందిచడం వల్ల నరాల నొప్పి, తిమ్మిరి, స్పర్శకోల్పోవడం వంటి సమస్యలను వీటికి కారణమైన రక్తంలోని వివిధ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. అంతేకాకుండా రోగి మానసిక, శారీరక స్థితి గతులను క్షుణ్ణంగా విచారించాలి. తద్వారా దానికి అనువైన చికిత్సను అందించడం ద్వారా నాడీ వ్యవస్థ పనితీరును సరిచేసి డయాబెటిక్ న్యూరోపతి వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు.

5140
Tags

More News

VIRAL NEWS