నేత్రాలు.. నిజాలు


Wed,January 28, 2015 03:16 AM

Face

-శుశ్రుతుడు కంటివైద్యానికి కూడా ఆద్యుడే. 2270-2210బిసి కాలంలోనివాడైన ఐరీ (Iry) మొట్టమొదటి ఆఫ్తమాలజిస్టు. ఆయన డీన్ ఆఫ్ రాయల్ ఫిజీషియన్స్‌కి డైరెక్టర్‌గా ఉండేవాడు.
-ఇండియన్ ఫిలాసఫీలో మొదటి కన్ను గాయం అంటే వామనుడు శుక్రాచార్యుడి కన్ను పొడవడమే అని చెప్పుకోవాలి.
-గ్లకోమా వచ్చినవాళ్లకు కన్నులోని ప్యూపిల్ సముద్రపు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. అందుకే దీన్ని గ్లకోమా అన్నారు. గ్లకోమా అంటే గ్రీన్ ట్యూమర్ అని అర్థం.
-కాటరాక్ట్ అంటే జలపాతం అని అర్థం. కాటరాక్ట్ అంటే తల నుంచి ఏదో తెల్లని పదార్థం జారి పడుతూ ఉండి కన్నుకు అడ్డం పడింది అనుకునేవాళ్లు. అలా పైనుంచి ద్రవం పడుతోంది కాబట్టి కాటరాక్ట్ (జలపాతం) అన్నారు.
-రెటీనా క్యాన్సర్ వచ్చినప్పుడు పిల్లల కళ్లు రాత్రిపూట పిల్లి కళ్లలాగా ఉంటాయి.
-70 శాతం తలనొప్పులు కంటికి సంబంధించినవే ఉంటాయి.
-తీవ్రమైన నొప్పితో కూడిన ైబ్లెండ్ ఐ ఉన్నప్పుడు అంటే గాయం వల్లగానీ, ఇన్‌ఫెక్షన్, క్యాన్సర్ లాంటి కారణాల వల్లగానీ.. ఇలాంటప్పుడు కన్నును పూర్తిగా తీసేస్తారు. 16వ శతాబ్ద కాలంలో కంటి క్యాన్సర్ అన్న అవగాహన ఉండేది కాదు గాని అది చాలా ప్రమాదకరం అని మాత్రం అనుకుని కన్నును తీసేసేవాళ్లు.
-నిమి చక్రవర్తి ఓ యాగం తలపెట్టాడు. దానికి ఆహ్వానించిన ముని ఎన్నేళ్లు గడిచినా రాకపోయేసరికి సమయం మించిపోతున్నదని యాగం ప్రారంభించాడు. 8 ఏళ్ల తరువాత వచ్చిన ఆయన నేను రాకముందే యాగం ఎందుకు మొదలెట్టావని కోపించాడు. నువ్వు అశరీరుడవు అవుతావని శపించాడు. శాప పరిహారం చెప్పమని అర్థించాడు నిమి చక్రవర్తి. నీకు శరీరం లేకపోయినప్పటికీ మనిషి కన్నులో నిరంతరం బతికే ఉంటావని చెబుతాడు. కనురెప్పలు మూసి తెరిచే కాలాన్ని లిప్తపాటు అంటారు. నిజానికి నిమిషం అంటే ఈ లిప్తపాటు కాలం అని అర్థం. అలా నిమి చక్రవర్తి పేరుమీదే నిమిషం వచ్చింది.
-మనిషి దృష్టి పరిమితి అనంతం. అంటే అంగుళం పరిమాణం ఉన్న కన్ను విశ్వాన్ని అంతటినీ చూస్తుంది. అందుకే కన్నులో విశ్వ రహస్యాలు ఇమిడివున్నాయంటే అతిశయోక్తి కాదు. మన కన్నులోపలి రెటీనాపై ప్రతిబింబం పడినప్పుడే ఆ దృశ్యాన్ని చూడగలుగుతాము. ఇలా రెటీనాపై పడే ప్రతిబింబం నాలుగు మైక్రాన్లకు మించదు. అంటే అంతకన్న తక్కువ పరిమాణంలో ఉన్న ప్రతిబింబాలు రెటీనాపై ఏర్పడినా మనకు కనిపించవు. బాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు మన సాధారణ కంటికి కనిపించకపోవడానికి కారణం ఇదే. మైక్రోస్కోపు సాయంతో పెద్దదిగా చేసి చూపించే లెన్సు ఆధారంగా మనం బాక్టీరియాను చూడగలుగుతున్నాము. అదేవిధంగా టెలిస్కోపు సాయం ఉంటేనే విశ్వంలో దూరంగా ఉన్న వాటిని చూడగలుగుతాము. అంటే మన కన్ను దృష్టి ఎంత దూరమైనా వెళ్తుంది. వాటి ప్రతిబింబాలను ఏర్పరచగలుగుతుంది. అంటే మన కంటిలో విశ్వం ఉన్నట్టే కదా.

5957
Tags

More News

VIRAL NEWS

Featured Articles