నువ్వులతో ఆరోగ్యం


Tue,September 11, 2018 01:09 AM

నువ్వులు రుచికే కాదు.. ఆరోగ్యానికీ మంచి ఔషధాల్లాంటివి. నువ్వుల గింజలు, నువ్వుల నూనె, నువ్వుల వేళ్లు ఇలా నువ్వుల మొక్కల నుంచి వచ్చే ప్రతీది ఉపయోగకరమే. కొన్నిసార్లు డాక్టర్లు సూచించిన మెడిసిన్స్ కూడా చేయలేని మేలును నువ్వులు చేస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి.
Sesame

కళ్లు: శీతాకాలంలో నల్ల నువ్వుల నుంచి తీసిన రసాన్ని కళ్లలో పోసుకుంటే కళ్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు. సైట్ ఉన్నా తగ్గిపోతుంది.

దగ్గు: నల్ల నువ్వులు, తులసి ఆకులు, అల్లం వేసుకొని డికాషన్ చేసుకొని తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు.

ఆకలి: విపరీతమైన ఆకలిని నియంత్రించడానికి నువ్వులతో కూడిన ఆహారం తీసుకోవాలి.

కీళ్లవాపు: నువ్వుల ద్వారా చేసిన ఆహారాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ తగ్గుతుంది.

రుతుస్రావం: పీరియడ్స్ సక్రమంగా లేనప్పుడు, కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు 5 గ్రాముల నువ్వుల గింజలు వేసుకొని డికాషన్ చేసుకుంటే తగ్గిపోతాయి.

దంతాలు: రోజూ 10 గ్రాముల నువ్వులు తినడం వల్ల దంతాల సమస్యలు దరిచేరవు.

కిడ్నీ: నువ్వుల పొడిగానీ, నువ్వు మొక్కల వేర్లు గానీ పొడిగా చేసుకొని పొద్దున, సాయంత్రం తింటే కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.

191
Tags

More News

VIRAL NEWS