నీలి వజ్రాల రహస్యం


Mon,August 27, 2018 11:18 PM

అత్యంత అరుదైన నీలి వజ్రాల రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. 46 నీలి వజ్రాలపై జరిగిన ఒక పరిశోధనలో అవి భూగర్భంలో ఎక్కడ, ఎలా ఏర్పడతాయన్న దానిని వారు గుర్తించారు.
Pridhwi-shastram
సహజ సిద్ధమైన నీలి వజ్రాలు (Blue Diamonds) లభ్యమవడమే చాలా అరుదు. మొత్తం వజ్రాల్లోని ఒక శాతంలో వెయ్యో వంతు మాత్రమే ఇవి ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువగా లేత, ముదురు నీలాల రంగులో ఇవి లభ్యమవుతై. అత్యంత స్వచ్ఛమైన నీలి వజ్రాలను టైప్ IIబిగా పిలుస్తారు. ప్రసిద్ధ నీలి వజ్రాల్లో ఒకటి హోప్ డైమండ్. వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ హిస్టరీలో 1958 నుంచీ భద్రపరచి ఉంది. చాలా ఖరీదైన ఈ నీలి వజ్రాలు భూగర్భంలోని ఆవరణం (mantle) నట్టనడుమ పరివర్తన ప్రదేశం (Transition zone) లో ఏర్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఉపరితలానికి సుమారు 410 నుంచి 660 కిలోమీటర్ల లోపల ఇవి రూపొందుతున్నట్టు వారు వెల్లడించారు. సాగరజల ఖనిజాల కారణంగానే వాటికి ఇంతటి విలక్షణ నీలి వర్ణం వస్తున్నట్టు వారు కనుగొన్నారు. నేచర్ పత్రిక తాజా సంచికలో వారి పరిశోధనా ప్రచురితమైంది.

147
Tags

More News

VIRAL NEWS