నీటిపై ఎగురుతాయి..


Thu,August 23, 2018 12:36 AM

ఇప్పటి వరకు విమానాలంటే గాలిలో, నేల మీద పరుగెత్తడం చూశాం. ఇప్పుడు ఏకంగా నీటిపైన కూడా రయ్‌మంటూ దూసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా సబర్మతి నది, చిలికా సరస్సుపై ఈ విమానాలను నడిపించనున్నారు.
water-werodrome
కేంద్ర ప్రభుత్వం కొత్తగా నీటిపై ప్రయాణించే విమానాలను అన్ని రాష్ర్టాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన అనుమతులు కూడా త్వరగా పూర్తి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ కొత్త ప్రాజెక్ట్ ట్రయల్
రన్‌ను సబర్మతి నది, చిలికా సరస్సుల్లో విజయవంతంగా ప్రయోగించారు. దీనిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ లాంఛనంగా ప్రారంభించి, అందులో ప్రయాణించారు. సబర్మతి నదిలో ప్రయోగించిన ఏరోడ్రోమ్స్ ఏకంగా 180 కిలోమీటర్ల మేర నీటిపై ప్రయాణించి ధరోయి డ్యామ్‌ను చేరుకున్నది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఏరో డ్రోమ్స్‌తో కలిపేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, కేరళ వంటి రాష్ర్టాల్లో వాటర్ ఏరోడ్రోమ్‌ని నిర్మించడానికి ఎంపిక చేశారు. వీటికి రన్‌వే దాదాపు 300 మీటర్లు ఉండేలా ప్లాన్ చేశారు. పర్యాటకుల అభిరుచికి తగ్గట్లుగా నిర్మాణం, సీట్లు ఉండేలా చూస్తున్నారు. ఇవి పర్యాటకంగానే కాకుండా.. ప్రమాద సమయాల్లో బాధితులను కాపాడేందుకు ఉపయోగించుకోవచ్చు. 14 నుంచి 20 మందిని ఒకేసారి తీసుకెళ్లేలా వీటి తయారు చేయనున్నట్లు సమాచారం.

386
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles