నిస్వార్థ సేవకు హ్యాట్సాఫ్!


Fri,November 16, 2018 11:07 PM

సమాజంలో అభాగ్యులకు సేవలందించి ఎంతో మంది నిరుపేదలను, అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నది ఓ ఎన్జీఓ. వారికి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నది.

menaka
బెంగళూరుకు చెందిన మేనక స్టీఫెన్ అనే యువతి చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడింది. చిన్నతనంలోనే ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఐదుగురు సంతానాన్ని పోషించడానికి మేనక తల్లి ఎన్నో కష్టాలు పడింది. ఇండ్లలో పనులు చేసి, వచ్చిన సంపాదనతో పిల్లలందరినీ సాదడం భారమైంది. దీంతో మేనకను పరిక్రమ హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో చేర్పించింది తల్లి. ఆ స్వచ్ఛంద సంస్థ నిరుపేద పిల్లలను చేరదీసి వారికి విద్యతోపాటు ఇతర నైపుణ్యాలపై శిక్షణ ఇస్తూ.. ఉజ్వల భవిష్యత్‌ను ప్రసాదిస్తున్నది. అంతేకాకుండా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ సహకారంతో ఈ ఫౌండేషన్ విద్యార్థులకు పలు అంశాలపై తర్ఫీదు ఇస్తున్నది. వీటితో పాటు నిరక్షరాస్యులను, పుస్తక పరిజ్ఞానం లేని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారికి చదువు చెప్పిస్తున్నది. ఇందులో 5 నుంచి 25 యేండ్ల నిరుపేదలకు అవకాశం ఇస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన మేనక ఐబీఎంలో ఉద్యోగం సంపాదించింది. తనకు అక్కడ మంచి జీతం. అయినా ఏదో అసంతృప్తి. ఆ ఉద్యోగం చేస్తూనే తన ఎదుగుదలకు తోడ్పాటునిచ్చిన ఫౌండేషన్‌కు తన వంతుగా సేవ చేస్తున్నది. వారానికి ఓసారి అక్కడికి వెళ్లి వలంటీర్‌గా పనిచేస్తున్నది. కొద్దిరోజుల తర్వాత పూర్తిస్థాయిలో సేవ చేయాలని నిర్ణయించుకున్నది. ఇదే ఫౌండేషన్‌లో సైన్స్ టీచర్‌గా చేరింది. చిన్నప్పుడు తనకు ఆశ్రయం కల్పించిన పరిక్రమ హ్యూమానిటీ ఫౌండేషన్‌లో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నది మేనక స్టీఫెన్. తనలాంటి వాళ్లకు నిస్వార్థంగా సేవ చేస్తున్న మేనకను అందరూ అభినందిస్తున్నారు.

720
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles