నిర్మాణ సామాగ్రికి రెట్టింపు డిమాండ్


Fri,August 17, 2018 11:24 PM

Construction-site
భారత నిర్మాణ రంగం వేగంగా దూసుకుపోతున్నది. దేశంలో పరిపాలనరీత్యా జరుగుతున్న సానుకూల పరిణామాలు, తీసుకుంటున్న చర్యలు రియల్ రంగాన్ని ఉత్తేజపరుస్తున్నాయి. 2022 నాటికి అందిరికీ గృహాలు, అందుబాటు ధరల గృహ నిర్మాణాలకు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం, రెరా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ స్నేహపూర్వక వాతావరణం.. వంటి అంశాలు ముఖ్యమైనవి. ఈ క్రమంలో భారత నిర్మాణ రంగం సామాగ్రికి ఎక్కడ లేని గిరాకి వచ్చినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. 2014-15 తో పోల్చితే దాదాపు 15 శాతం దాకా పెరిగినట్లు ఆఫ్ హైవే రీసెర్చ్ అనే సంస్థ వెల్లడించింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణ రంగ సామగ్రి అమ్మకాలు 90,115 యూనిట్లకు చేరనుంది. 2018 తొలి అర్థ భాగంలో నిర్మాణ రంగం, మైనింగ్ సెక్టార్‌లో వేగం పెరిగిందని, రెండో అర్థభాగంలో కూడా అశించినంత వేగంతో వృద్ధి నమోదవుతున్నట్లు ఆఫ్ హైవే రీసెర్చ్ తెలిపింది. సులువుగా ఆర్థిక సహకారం, సానుకూల ఆలోచనలు, డిమాండ్, ఇతర అంశాలు నిర్మాణ సామగ్రి మార్కెట్‌కు మంచి డిమాండ్‌ను కల్పిస్తున్నాయని నివేదికలో వెల్లడించింది.

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles