నిద్రలేమి ఒంటరిని చేస్తుంది!


Mon,August 27, 2018 11:25 PM

ఆధునిక జీవనశైలి ఒకవైపు ప్రగతి వైపు తీసుకెళుతూనే మరోవైపు వెనకబాటుకు కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. జీవనశైలిలో మార్పుల వల్ల పని.. ఆహారం.. నిద్ర వంటి వాటిల్లో మార్పులు చోటుచేసుకొని మనమే సమస్యలను కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటివాటిలో నిద్రలేమి ఒకటి.
Study
నిద్రలేమి వల్ల మానసిక.. శారీరక సమస్యలు వస్తాయని తెలుసు కదా. ఇప్పుడు పరిశోధకులు మరొక విషయాన్ని కనిపెట్టారు. నిద్రలేమి వల్ల ఒంటరితనం అలవాటు పడుతుందట. ఇది క్రమంగా మానసిక ఆందోళనగా మారుతుందట. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా నిద్రలేమి-పర్యవసనాలు అనే అంశంపై అధ్యయనం చేశారు. 18 ఏళ్లు నిండిన వేలాదిమందిపై రెండే వేర్వేరు సందర్భాల్లో ఈ అధ్యయనం చేపట్టారు. వీరిలో 60% నిద్రలేమితో బాధపడుతున్నవారిగా గుర్తించారు. నిద్రలేమి క్రమంగా ఒంటరితనానికి దారితీస్తుందనే విషయం ఈ అధ్యయనం ద్వారా తేటతెల్లమైనట్లు పేర్కొన్నారు. నిద్రలేమి ఒక సామాజిక అంటువ్యాధిలా మారుతూ భవిష్యత్ తరాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని వివరించారు. కాబట్టి కంట నిండా నిద్రపోయి మెరుగైన జీవితాన్ని గడపాలని సూచిస్తున్నారు.

175
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles