నిద్రతో జ్ఞాపకశక్తి


Tue,May 14, 2019 01:40 AM

చాలా తీరిక లేకుండా గడుపుతాం. ఒక్కోసారి తినడం కూడా మర్చిపోయి పనిలో మునిగిపోతాం. ఈ మర్చిపోవడం అనేది బిజీగా ఉండటం వల్ల కాదు.. సరిగా నిద్రపోకపోవడం వల్ల కలిగే సమస్య అంటున్నారు నిపుణులు. కంటి నిండా నిద్రపోతే మంచి జ్ఞాపకశక్తి సామర్థ్యం కలిగి ఉండొచ్చని సూచిస్తున్నారు.
Good-sleep
నిద్ర ఏదో మొక్కుబడి వ్యవహారం కాదు అనీ.. అది రోజూ తప్పక జరగాల్సిన క్రియ అని చెప్తున్నారు పరిశోధకులు. ఇంటర్నేషనల్ న్యూరో సైకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో తాజాగా ఒక సర్వే చేశారు. ఆకలి అయినప్పుడు ఆహారం తీసుకున్నట్లు.. దూప అయినప్పుడు నీళ్లు తాగినట్లు నిద్రకూ సమయం కేటాయించాల్సిందే అని వారు వివరించారు. సరిగ్గా నిద్రపోతే మన శారీరక.. మానసిక వ్యవస్థలు రీఫ్రెష్ అవుతాయి.. దానితోపాటు రెండింటి మధ్యన మంచి సమన్వయం ఏర్పడుతుంది. సరిపడా నిద్ర పోకపోతే ఈ సమన్వయ లోపం ఏర్పడి మతిమరుపు సమస్య ఏర్పడుతుంది. చదువుకునే వారికి అయితే నిద్ర మంచిగా పోతే రీజనింగ్స్.. కాంప్రెహెన్సివ్ సామర్థ్యం పెరుగుతుందట. క్రియేటివిటీ మెరుగవుతుంది. భాషా సామర్థ్యం రెట్టింపవుతుంది. నెగెటివ్ క్వాంటిటేటివ్ ఆలోచనలు తొలగిపోతాయి అంటున్నారు. 21-77 సంవత్సరాల వయసున్న వారిపై ఈ సర్వే చేపట్టారు.

113
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles