నా బిడ్డపై ప్రభావం ఉంటుందా?


Mon,February 5, 2018 12:21 AM

నాకు 34 ఏళ్లు. నాలుగు నెలల గర్భవతిని. నాకు హైపోథైరాయిడిజం ఉంది. గుండెదడగా ఉంటుంది. చర్మం ఎప్పుడూ పొడిబారుతుంది. హైపోథైరాయిడిజానికి సంబంధించి మందులు వాడుతున్నాను. దీనివల్ల నా బిడ్డ మీద దుష్ప్రభావం ఉండదనే అనుకుంటున్నాను. నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- సి. పద్మజ, సిరిసిల్ల

Pragnet
హైపోథైరాయిడిజం లక్షణాలు, గర్భధారణ లక్షణాలు దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. అవి - గుండె వేగంగా కొట్టుకోవడం (టాకీకార్డియా), వేడిని తట్టుకోలేకపోవడం, చెమటలు పట్టడం, బరువు తగ్గడం లేక పెరుగడం, ఆకలి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనికి మొదటగా డాక్టర్‌ని సంప్రదించి క్రమం తప్పకుండా మందులు వాడాలి. హైపోథైరాయిడిజాన్ని కంట్రోల్‌లో పెట్టుకోకపోతే బిడ్డ పెరుగుదల తగ్గడం, గుండె అధికంగా కొట్టుకోవడం మీద ప్రభావం చూపుతుంది. మీ ఆహారంలో తగిన మార్పులు చేసుకోవడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ని నియంత్రించవచ్చు. దీనితో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. హైపోథైరాయిడిజం రావడానికి ముఖ్య కారణం మన ఆహారంలో సోడియం నిల్వలు తగ్గిపోవడమే. అందువల్ల సోడియం ఎక్కువగా ఉండేలా ఆహారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకోసం సముద్రపు చేప, ఉప్పునీటి చేపల వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మరో ముఖ్య ఖనిజం సెలీనియం. ఇది అధికంగా ఉండే ఆహారం థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పెరగడానికి దోహపడుతుంది. ఇది ఎక్కువగా సముద్రపు ఆహారం, కొవ్వు లేని మాంసం, పప్పుధాన్యాల్లో, దంపుడు బియ్యంలో అధికంగా ఉంటుంది. కొబ్బరి నూనె కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఏ మేరకు తీసుకోవాలనే మన వయసు, శరీరతత్వాన్ని బట్టి ఉంటుంది. బరువు పెరగడం హైపోథైరాయిడిజమ్ లక్షణం. అందువల్ల మీ ఆహారంలో ఎక్కువ పీచుపదార్థాలు ఉన్న పండ్లు, కూరగాయలు, గోధుమ పిండి తీసుకోవాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల బరువు పెరుగకుండా కాపాడుకోవచ్చు. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటిస్తే హైపోథైరాయిడ్ లక్షణాలను తగ్గించవచ్చు.

నేహా తన్సీమ్
క్లినికల్ న్యూట్రిషనిస్ట్
కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles