నా పరిస్థితి ఏమిటి?


Thu,April 6, 2017 02:50 AM

వయసు 23 సంవత్సరాలు, నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. నాకు మూడు వారాల క్రితం ఎడమ వైపు ఛాతిలో నొప్పి వచ్చింది. అదే సమయంలో 101 టెంపరేచర్ జ్వరం కూడా వచ్చింది. డాక్టర్ ఎక్స్‌రే తీసి ప్లూరల్ ఎఫ్యూజన్ అని నిర్ధారించారు. టీబీ అయి ఉండవచ్చని ఆరు నెలలు మందులు వాడడం మొదలు పెట్టిన తర్వాత నాకు వాంతులు, ఆకలి మందగించడం వంటి సమస్యలు వచ్చాయి. నా ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనగా అనిపిస్తున్నది. నా ఈ పరిస్థితికి కారణం ఏమిటో తెలుపగలరు?
మురళి, హైదరాబాద్
lungs

రెండు ఊపిరితిత్తుల చుట్టూ ఒక పొర ఉంటుంది. దానిని ప్లూరా(ఊపిరితిత్తుల్లో నీరు, చీము చేరటం) అని అంటారు. ఆ పొరలో అనేక కారణాల వల్ల నీరు కానీ, చీము కానీ, రక్తం కానీ చేరవచ్చు. మనదేశంలో టీబీ సాధారణంగా ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఆ మందులు సూచించినట్టు ఉన్నారు. అయితే మీరు పైన తెలిపిన వివరాలలో గతంలో ఎప్పుడైనా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారో అని వివరించలేదు. కానీ సూచించిన మందుల వల్ల మీకు ఆరోగ్య సమస్యలు ఎక్కువైనట్టుగా తెలుస్తోంది. మీరు వెంటనే ఆ మందులు ఆపేసి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోండి. అసలు ఊపిరితిత్తులలో నీరు చేరడానికి కారణం తెలుసుకొని దానికి ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ నీరు చీముగా మారి గడ్డకట్టే ప్రమాదం ఉంది. అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా ఊపిరితిత్తులలో చేరిన నీరును తీసి టెస్ట్‌లకు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ చీము కూడా చేరినట్టయితే ఊపిరితిత్తులలోకి చిన్న ట్యూబ్‌ని పంపించి తద్వారా దానిని పూర్తిగా తీసేయొచ్చు. టీబీని పూర్తిగా నయం చెయ్యడానికి ప్రస్తుతం మందులు కూడా ఉన్నాయి. మీరు మరింత ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత విషమించవచ్చు.
డాక్టర్ లక్ష్మణ్ బాబు
పల్మనాలజిస్ట్
సన్‌షైన్ హాస్పిటల్స్
సికింద్రాబాద్

1394
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles