నాకదే గొప్ప విషయం!


Mon,August 20, 2018 01:16 AM

క్రీడారంగంలోకి క్రికెట్ వచ్చేశాక.. మిగతా ఆటలను పట్టించుకునేవారే కరువయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు తెచ్చినా.. గుర్తింపునకు నోచుకోవడం లేదు. అందుకు ఉదాహరణే నిత్యారమేష్. అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్‌లో రజతం సాధించినా, ఆమెకు స్వాగతం చెప్పేందుకు కాదుకదా, అభినందించడానికి కూడా ఎవ్వరూ రాలేదు. అయినా, దేశానికి పతకం సాధించానన్నదే తనకు గొప్ప విషయమంటున్నది.
Nithya-Ramesh
క్రికెట్ దేశాన్ని ఊపేస్తున్నది. ఇక టీ-20తో అందరిచూపు క్రికెట్‌వైపే మళ్లింది. దీంతో మిగతా ఆటలను పట్టించుకునేవారే కరువయ్యారు. మిగ తా వాటికి అరకొర నిధులు విడుదల చేస్తున్నారే తప్పా, పతకాలు సాధించిన క్రీడాకారులను సైతం పట్టించుకోవడం లేదు. గతవారం యూరప్‌లోని బెలారస్‌లో జరిగిన ఓపెన్ ఐస్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో బెంగళూరుకు చెందిన నిత్యా రమేష్ రజతం సాధించింది. ఈ విషయాన్ని కనీసం స్థానిక మీడియా కూడా పట్టించుకోలేదు. అయితే ఆమె బెలారస్ నుంచి ఇండియాకు వస్తున్న క్రమంలో అక్కడ మన దేశానికి చెందిన వందన బంగేరా అనే ప్రయాణికులు నిత్యాను కలిసింది. ఆమె ప్రతిభను అభినందించింది. అయితే, నిత్యాకు బెంగళూరు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభిస్తుందని అనుకున్నది వందనా. నిత్య కారు డ్రైవర్ తప్పా సంబంధిత క్రీడాశాఖ అధికారులెవరూ రాకపోవడంతో నిత్యాతో ఫొటో దిగి, క్రీడలపై, క్రీడాకారులపై ఉన్న అశ్రద్ధను ఫేస్‌బుక్‌లో ఏకిపారేసింది. ఈ పోస్టు కాస్తా వైరల్ అయింది. అది చదివిన చాలామంది నెటిజన్లు నిత్యారమేష్‌కు అండగా నిలుస్తున్నారు. ఈ పోస్టుకు 68వేలకు పైగా లైకులు, 12వేలకు పైగా కామె ంట్లు రాగా, 28వేలమంది షేర్ చేశారు. అధికారుల అభినందన కంటే.. దేశానికి పతకం అందించానన్న తృప్తే తనకు చాలని అంటున్నది నిత్య.

553
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles