నడుము నొప్పికి హోమియోపతి


Wed,July 20, 2016 01:36 AM

సుమారు 40 నుంచి 50 శాతం జనాభాలో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నడుము నొప్పి వస్తుంది. కాని ప్రస్తుత జీవన విధానాల వలన ఇది 80 శాతం జనాభాను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఇది 20 నుంచి 40 సంవత్సరాల వయసువారిలో ఎక్కువ శాతం మొదలవుతుంది.

ఆన్యులర్ టియర్
వయసు పైబడే కొద్దీ వెన్నుమీద అధిక ఒత్తిడి పడినప్పుడు వెన్నుపూస (వర్టిబ్రా) మధ్య ఉండే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్‌లోని ఒక భాగం చిరగడాన్ని ఆన్యూలర్ టియర్ అని అంటారు. ఇలా చిరిగిన ఆన్యూలస్ వాపుకి గురై నడుము నొప్పికి దారి తీస్తుంది. దీనినే డిస్క్ డీజనరేటివ్ డిసీజ్ అని అంటాము.

హెర్నియేటెడ్ డిస్క్
దీన్నే డిస్క్ ప్రొలాప్స్ అని కూడా అంటారు. బలహీనపడిన డిస్క్ అంచు చిరిగి దాని మధ్య భాగంలో ఉండే మెత్తని న్యూక్లియస్ బయటకు తీసుకొని రావడాన్ని హెర్నియేషన్ అని అంటారు. ఇలా హెర్నియేట్ అయిన డిస్క్ వెన్ను నుంచి బయటకు వచ్చే నరాలను నొక్కినప్పుడు వచ్చే లక్షణాలను సయాటికా అని అంటారు.

స్పాండిలోలిస్థిసిస్
ఇందులో వెన్నులోని ఎముకలు పరిమితికి మించి ముందుకు కాని వెనకకు కాని జారడాన్ని స్పాండిలోలిస్థిసిస్ అని అంటారు. ఇది వెన్నులోని ఎముకలు (వర్టిబ్రా)ను పట్టి ఉంచే లిగమెంట్లు సాగడం, వర్టిబ్రాలోని ఒక భాగం విరగడం వలన వస్తుంది. స్పాండిలోలిస్థిసిస్ తీవ్రంగా ఉంటే నరాలు మెలికపడడం, నరాలపై వర్టిబ్రా వత్తిడి వలన తీవ్రమైన నడుమునొప్పికి, ఇతర లక్షణాలకు దారితీస్తుంది.

స్పైనల్ స్టినోసిస్
వెన్నులోపల ఉండే స్పైనల్ క్యానల్ అనే నాళం ఇరుకుగా మారడం లేదా మూసుకుపోవడాన్ని స్పైనల్ స్టినోసిస్ అని అంటారు. ఇది తీవ్రంగా ఉండే నాళంలో ఉండే వెన్నుపాము వత్తిడికి గురై తీవ్రమైన వెన్నునొప్పితో పాటు, కాళ్లు పడిపోవడం, తిమ్మిర్లు రావడం, మొద్దుబారడం, మలమూత్రాల నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఆంకైలోస్పాండిలైటిస్
ఇది వెన్నుపూస దీర్ఘకాలిక వాపునకు గురవడం వలన వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఎక్కువగా తుంటి కీలు (సాక్రో ఇలియాక్ జాయింట్), వెన్నుపూసను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా యుక్తవయసులో ఉన్నవారికి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారి వెన్నుపూసలోని ఎముకలు బిగుసుకుపోయి నడుము కదలికలు కష్టతరం అవుతాయి. దీనినే బాంబూ స్పైన్ అని అంటారు.

వర్టిబ్రా ఫ్రాక్చర్
వెన్నుకు దెబ్బ తగలడం లేదా దీర్ఘకాలికంగా ఆస్టియోపోరొసిస్ వలన వత్తిడికి గురిఅయినప్పుడు వెన్నులోకి వర్టిబ్రా విరిగిపోయే ప్రమాదం ఉంది. దీని వలన తీవ్రమైన వెన్నునొప్పి నరాలకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి.

లక్షణాలు
సాధారణం నుంచి తీవ్రమైన నడుము నొప్పి. నడుము పట్టేయడం. వెన్నులోని ఎముకలతో పాటు నరాలు కూడా వ్యాధి బారిన పడితే నొప్పి నడుములో ప్రారంభమై పిరుదుల్లోకి అక్కడి నుంచి తొడల్లోకి, కాళ్లు పాదాల వరకు నొప్పి వ్యాపిస్తుంది. కాళ్లలో తిమ్మిర్లు పాదాలలో మంటలు రావడం, మొద్దుబారడం వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.
వ్యాధి తీవ్రంగా ఉంటే కాళ్లు పడిపోవడం, మలమూత్రాల నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
నడుము నొప్పి దీర్ఘకాలికంగా ఉండి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది క్షయ, క్యాన్సర్ లక్షణాలు అయివుండవచ్చు.

చికిత్స
జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ వైద్య పద్ధతి ద్వారా వెన్నునొప్పి, సయాటికా, కాళ్ల తిమ్మిర్లు, పాదాల మంటలనే కాకుండా మూల కారణాన్ని గుర్తించి వైద్యం చేయడం ద్వారా వెన్నుపూసను దృఢంగా చేసి మళ్లీ నడుము సమస్యలు రాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.
homeocare-Article

1769
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles