నడుంనొప్పా.. కదలడమే మేలు.!


Mon,March 20, 2017 01:39 AM

pains
నడుమునొప్పి బాధిస్తోంటే వెంటనే అలా పక్క మీద ఒరగాలనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం డాక్టర్లు కూడా నడుమునొప్పి ఉంటే ఇలా రెస్ట్ తీసుకోవడమే మంచిదని సూచించేవారు. కాని ఆధునిక వైద్య శాస్త్రం ఇందుకు ససేమిరా అంటోంది. అలా రెస్టులో ఉండే నొప్పి మరింత పెరుగుతుందంటున్నారు నేటి డాక్టర్లు.
ఒక యంత్రం సరిగ్గా పనిచేయాలంటే దాన్ని ఉపయోగిస్తూ ఉండాలి. అదేవిధంగా మన శరీరంలో ఎముకల నుంచి మృదువైన కణజాలాల వరకు అవి ఎప్పుడూ చురుగ్గా పనిచేస్తూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయి. కదలకుండా ఉంటే ఏ అవయవ సమస్య అయినా పెరుగుతుంది. యాక్టివిటీ లేకపోతే కండరాలు బలహీనం అవుతాయి. లిగమెంట్లు, టెండాన్ల వంటి మృదు కణజాలాలు తమ స్థితిస్థాపక లక్షణాన్ని కోల్పోయి సులువుగా గాయాలపాలవుతాయి. డిస్కులకు పోషకపదార్థాలు అందక ఫ్లెక్సిబిలిటీని కోల్పోతాయి.

వ్యాయామం లేకపోతే నడుమునొప్పి దీర్ఘకాలిక
సమస్య అవుతుంది. దాంతో ఆమాత్రం కదలిక లేకుండా బెడ్‌రెస్ట్ అవసరం అవుతుంది. అలా కదలకుండా రెస్టులో ఉండడం వల్ల నొప్పి మరింత తీవ్రతరం అవుతుంది. పైగా బెడ్‌రెస్ట్‌లో ఉన్నవాళ్లు మానసికంగా కుంగిపోయి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అందుకే వీలైనంతవరకు బెడ్‌రెస్ట్ లేకుండా నడవడం మంచిదని సూచిస్తారు వైద్యనిపుణులు. నడుమునొప్పి ఉన్నప్పుడు స్ట్రెచింగ్ వ్యాయామాలు, నడుముపై ప్రభావం చూపే ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేయాలి. నడుమునొప్పితో బాధపడుతున్నప్పుడు కొత్తరకం ఎక్సర్‌సైజు చేయాలనుకుంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు ఏమాత్రం నొప్పిగా అనిపించినా తాత్కాలికంగా ఆపేయాలి. అంతేగాని నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయడం మాత్రం మానొద్దు. ఇదంతా ఎందుకు.. రోజు 40 నిమిషాల నడకతో అసలు నడుమునొప్పి రాకుండానే నివారించుకోవచ్చని కూడా సూచిస్తున్నారు నిపుణులు.

1106
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS