ధ్యానం కన్నా నడకే మిన్నా!


Tue,January 1, 2019 02:27 AM

Walk
ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి చాలామంది ధ్యానం చేస్తుంటారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని కూడా నిరూపితమైన సంఘనటలు ఎన్నో ఉన్నాయి. అయితే ధ్యానం కన్నా బెటర్ ఆప్షన్ ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సాధారణంగా ఒత్తిడి ఉన్నవారిలో హైబీపీ సమస్యలు ఉంటాయి. ప్రతీదానికి చిరాకు పడటం.. ఏకాగ్రత కోల్పోవడం.. కోపం తెచ్చుకోవడం వంటి లక్షణాలు తరచూ ప్రదర్శిస్తుంటారు. వీటన్నింటినీ నియంత్రణలో పెట్టుకోవడానికి మెడిటేషన్‌ను అయితే ఎలా సాధనంగా ఉపయోగిస్తున్నామో.. నడకను కూడా అలాగే సాధనంగా ఉపయోగించవచ్చు అంటున్నారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సైన్స్ పరిశోధకులు. హైబీపీ సమస్యలను పరీక్షించేందుకు వీరు 29,281 పరీక్షలు జరిపారు. 10,461 వలంటీర్లు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. మెడిటేషన్‌ను పాటిస్తున్న వారిపై జరిపిన 194 పరీక్షల్లో హైపర్‌టెన్సివ్ సమస్యల్లో పెద్దగా మార్పుల్లేనట్లు తేలాయి. నడకను పాటిస్తున్నవారిపై జరిపిన 400 పరీక్షల్లో హైపర్‌టెన్సివ్ సమస్య తగ్గినట్లుగా తేలింది. దీన్నిబట్టి మెడిటేషన్ కన్నా కూడా నడక మంచి ఉపయోగకారిగా పనిచేస్తుందని చెప్పవచ్చు అంటున్నారు యూకే శాస్త్రవేత్తలు. హైపర్‌టెన్షన్ సమస్యలు తగ్గించుకోవడానికి నడక మంచి ఔషధకారి అని వారు పేర్కొన్నారు. సాధారణ నడకతో పాటు తేలికపాటి వ్యాయామం చేస్తే ఇంకా మంచిదనీ అంటున్నారు.

379
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles