ద్వీపాన్ని తలపిస్తుంది.. అనుభూతినిస్తుంది


Wed,June 27, 2018 11:40 PM

నాలుగు గోడల మధ్య ఉండే రెస్టారెంట్లలో తిని బోర్ అయ్యారా? రెగ్యులర్ ఫుడ్‌ని టేస్ట్ చేస్తూ చిరాకొస్తుందా? అయితే ఆలివ్ బిస్ట్రోకి వెళ్లండి. రొటీన్‌కు భిన్నంగా ఉండే రొమాంటిక్ స్పాట్ అది. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు దగ్గర ఉన్న ఆ రెస్టారెంట్ విశేషాలు ఇవి.
Restarent
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ మీదుగా దుర్గంచెరువు వెళ్లే దారి.. టూరిజం డిపార్ట్‌మెంట్ ఎంట్రన్స్ గేటు ఎడమవైపు ఆలివ్ బిస్ట్రో ఉంటుంది. ప్రధాన ద్వారం పాము ఆకారంలో అటు ఇటు తిరుగుతూ చుట్టూ పూల మొక్కలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. బయటి నుంచి చూస్తే ఇదేంటో చిన్న ఫుడ్ రెస్టారెంట్ అనుకుంటారు చాలామంది. లోపలికి వెళ్తున్న కొద్దీ ఆశ్చర్యచకితులవుతారు. పేద్ద గాలి పంకా మెల్లగా తిరుగుతూ స్వాగతం పలుకుతుంది. చల్లని యాంబియన్స్ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కొంచెం ముందుకెళ్లి చూస్తే చుట్టూ గుట్టలు.. ఆ గుట్టల మధ్య నీటి సరస్సు అదే దుర్గం చెరువు. పక్కన ఆనుకొని ఉన్న పార్క్. దూరంలో మేఘాలను తాకుతున్నట్టు భవనాలు. వేరే దేశంలో ఏమైనా ఉన్నామా? అన్న ఫీలింగ్ రాక మానదు. పక్షుల కిలకిలరావాలతో పాటు మ్యూజిక్ వింటూ తింటూ అక్కడే ఉండి పోవాలనిపిస్తుంటుంది. రెండు అంతస్తుల భవనంలా నిర్మించిన ఆలివ్ బిస్ట్రో కింది అంతస్తులో రెస్టారెంట్‌తో పాటు బార్ కౌంటర్.. పై అంతస్తులో డాన్స్ ఫ్లోర్, మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. రెండు అంతస్తుల నుంచి ఎటు చూసినా ద్వీపాన్ని తలపిస్తుంది. అనుభవిస్తే గానీ ఆ మజా తెలియదు.
Restarent1

ప్రతీది ప్రత్యేకమే

ఆలివ్ బిస్ట్రోలో ప్రతీది ప్రత్యేకమే అని చెప్పొచ్చు. వెయిటర్స్ వేసే డ్రెస్ దగ్గరి నుంచి కుర్చీల మీద వేసే కుషన్స్ వరకు అన్నీ కలర్ థీమ్స్ ఒకేలా ఉంటాయి. ఇది అన్ని రెస్టారెంట్స్‌లా ఉదయం నుంచి రాత్రి వరకు తెరిచి ఉండదు. సాయంత్రం ఏడు గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. కేవలం డిన్నర్ దొరుకుతుంది. ఆదివారం రోజు మాత్రం ఉదయం బ్రంచ్‌తో మొదలై రాత్రి వరకు నడుస్తుంది. ఇక్కడి బ్రంచ్ చాలా స్పెషల్.. ఎంతగా అంటే హైదరాబాదీ ఫుడ్ ప్రియులంతా అక్కడే ఉంటారన్నంత. ప్రతి బుధవారం క్యాండిల్ లైట్ రొమాంటిక్ డిన్నర్ ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా విదేశీయులు, కార్పొరేట్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటుంటారు. ఆలివ్ బిస్ట్రో ముంబై ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా 33 రెస్టారెంట్లను నడుపుతున్నది.
Restarent2

ఇంటీరియర్.. వండర్

రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టగానే తొంభయో దశకంలోకి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది. పాత వస్తువులన్నింటి ఒకచోట పెట్టినట్టు ఇదో మ్యూజియంలా కనిపిస్తుంది. పడవలు నడిపే తెడ్లు, పడవల్లో కనిపించే వస్తువులు, మీరెప్పుడు చూడని పెట్రోల్ బంకు వస్తువులు ఇక్కడ దర్శనమిస్తాయి. పింగాణీ పాత్రలతో తయారు చేసిన శాండ్లీయర్ ఆలివ్ బిస్ట్రోలో కనిపిస్తుంది. దేశంలో ఉన్న వీరి అన్ని రెస్టారెంట్లలో ఈ తరహా శాండ్లీయర్ ఉంటుంది. 75 మంది కూర్చొనే సీటింగ్ కెపాసిటీ కలిగి ఉన్నది.
Restarent3
ఇరవై మంది చెఫ్‌లతో కలిపి మొత్తం ఎనభైమంది పనిచేస్తున్నారు. వెళ్లాలనుకున్నవాళ్లు ముందురోజు టేబుల్ రిజిస్టర్ చేసుకొని వెళ్లాలి. సూప్స్, సలాడ్స్, బర్గర్స్, పిజ్జా, పాస్తా ఇక్కడి ఫేవరెట్ ఫుడ్. టాలీవుడ్‌లోని తారలంతా ఇక్కడి కస్టమర్లే. ఇండస్ట్రీ వాళ్లంతా వారాంతాల్లో ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు.

1338
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles