దేశీయవంటల కేంద్రం.. చైనా బిస్ట్రో


Wed,June 6, 2018 10:55 PM

చైనా బిస్ట్రో.. ఇదో చైనీస్ రెస్టారెంట్ అని కొందరుఫాస్ట్‌ఫుడ్ సెంటర్ లాంటిదని ఇంకొందరు మనకు సంబంధించింది కాదని మరికొందరు అనుకుంటారు కానీ, ఇది దేశీయ వంటల కేంద్రం. సంప్రదాయ భారతీయ వంటకాలను పరిచయం చేసే చైనా బిస్రోపై ఈ వారం సమీక్ష..
china-bistro

సూపీ సూపీ ఫుడ్.. యమ్మీ యమ్మీ టేస్ట్

వంటకాలతో పాటు పానీయాలను కలిసి బంధు మిత్రులతో సరదాగా గడుపాలనుకునేవాళ్లలకు, ఆఫీస్‌లో జరిగే పార్టీలకు, గెట్ టు గెదర్‌లకు చైనా బిస్ట్రో సరైన ఎంపిక. ఒకప్పుడు ఫ్రైడ్ అండ్ డ్రై వంటలకు మంచి గిరాకీ ఉండేది. ఇప్పుడు స్టయిల్ మారింది. ట్రెండ్ మారింది. ఇప్పుడు సూపీ సూపీ కోరుకుంటున్నారు. కొత్తగా చేర్చిన మెనూ దాదాపు అన్నీ వంటలు సూపీ ఉన్నాయి. ఆహారం విషయంలో క్వాలిటీ చెప్పనక్కర్లేదు. గ్రిల్ చికెన్, కబాబ్స్ వంటి ఎన్నో రకాల ప్రత్యేక వంటకాలను చూస్తే ఊరిస్తాయి. ఇక డ్రింక్స్‌లో కాక్‌టెయిల్స్, మాక్‌టెయిల్స్ భోజనానికి మరింత రుచిని జోడిస్తాయి. నైపుణ్యం, అనుభవం కలిగిన చెఫ్‌లున్నారు. దేశవిదేశాల్లో పెద్ద హోటళ్లలో పనిచేసిన అనుభవం వల్ల ఆహారం విషయంలో ఎలాంటి సందేహాలక్కర్లేదు. మార్పు చెందుతున్న ఆహార పద్ధతులను దృష్టిలో ఉంచుకొని వాటికి కొత్త రుచులను జోడించి ఈ రెస్టారెంట్ సాంప్రదాయ రుచులను అందిస్తున్నారు. నగరంలో భోజన ప్రియులను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చెందుతున్న క్రమంలో మరిన్ని బ్రాంచ్‌లు తెరువనున్నట్లు క్లస్టర్ హెడ్ లతీఫీ చెప్పారు.

china-bistro5
బార్+రెస్టారెంట్ = బిస్ట్రో. ఫుడ్‌లింక్ ఇండియా సంస్థకు చెందిన రెస్టారెంట్‌లలో ఒకటి చైనాబిస్ట్రో. రొటీన్ భోజనాలకు అలవాటు పడ్డవాళ్లకు రిలాక్స్ అవడానికి ఇది మంచి స్పాట్. రెగ్యులర్ రెస్టారెంట్‌లకు భిన్నంగా ఉంటుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న చైనా బిస్ట్రో ముందు రెండు చైనీస్ భటుల విగ్రహాలు స్వాగతం పలుకుతాయి. తలుపులు తెరుచుకొని రెస్టారెంట్‌లోకి ఎంటరవ్వగానే ఎడమ వైపు బార్‌కౌంటర్ ఉంటుంది. సీసాలను, గ్లాస్‌లను గాల్లోకి ఎగురవేస్తూ బార్ టెండర్ కనిపిస్తాడు. ఫుడ్‌లింక్ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నక్రమంలో హైదరాబాద్‌కు కూడా వచ్చింది. మొదటి బ్రాంచ్‌గా చైనా బిస్ట్రోని స్థాపించి భోజనప్రియులను ఆకట్టుకుంటున్నది. మూడేళ్లుగా కొత్త రుచులను పరిచయం చేస్తూ మంచి పేరు సంపాదించింది. ఈ మధ్య కొత్త మెనూను పరిచయం చేశారు. దాదాపు మెనూ అంతా మార్చి సరికొత్త సంప్రదాయ వంటకాలను పరిచయం చేశారు.

china-bistro6

ఇంటీరియర్.. ఎక్స్‌టీయర్

చైనా బిస్ట్రో ఇంటీరియర్‌లో అన్నీ ప్రత్యేకతలే. చుట్టూ గోడలపై ఆకట్టుకునే బొమ్మలు. ప్రశాంతమైన వాతావరణంలో వినసొంపుగా వచ్చే సంగీతం కొత్త అనుభవాన్నిస్తుంది. ఈ రెస్టారెంట్ లైట్ డార్క్ లైటింగ్‌తో ఉన్న ఇండియన్ స్టయిల్ రెస్టోబార్. 115 మంది కూర్చోగలిగే సీటింగ్ కెపాసిటీ ఉన్నది. ఇటాలియన్, చైనీస్, ఇండియన్ వంటలు ఇక్కడి ప్రత్యేకతలు. ప్రతిరోజూ బఫెలో సుమారు నలభై రకాల వంటకాలను రుచి చూడొచ్చు. అంతేకాదు టేబుల్ పై కూర్చోగానే శాంపెయిన్ బాటిళ్లలో మంచినీళ్లు ఉంటాయి. టేబుల్‌పై గ్రిల్డ్ స్టాండ్ పెడతారు. చికెన్ వింగ్స్‌ను మీకు నచ్చినట్టు కాల్చుకొని తినొచ్చు. ముఖ్యంగా గోడలపై ఉన్న చైనీయుల విగ్రహాలు, అక్కడి పనిముట్ల బొమ్మలు చూడగానే భలే అనిపిస్తాయి. ఫుడ్ సప్లయ్‌కు వాడే ప్లేట్లు, స్పూన్లు విభిన్నంగా ఉన్నాయి.
china-bistro3
china-bistro4
china-bistro2

1581
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles