దివ్యాంగుల పాలిట దేవత!


Thu,December 13, 2018 12:50 AM

సమాజానికి ఏదైనా చెయ్యాలనే ఆలోచన ఆమెది. తానేపని చేసినా.. భర్త సహకారం ఉంటుంది. ఒకరోజు ఆఫీస్‌కు వెళ్తే.. ఉద్యోగం కోసం వచ్చాడో దివ్యాంగ యువకుడు. అతనిలో ఉన్న పట్టుదలను గమనించిన ఆమె.. తన కంపెనీలో సగానికి పైగా దివ్యాంగులకు ఉద్యోగం కల్పించింది.
Pavitra-BPO
బెంగళూర్‌కు చెందిన పవిత్ర అక్కడి దివ్యాంగులకు ఉపాధి చూపెడుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నది. భర్త సహకారంతో వింధ్య ఈ ఇన్ఫోమీడియా ప్రై.లిమిటెడ్‌ను స్థాపించింది. ఈ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్(బీపీఓ)లో భాగంగా పలు మల్టీనేషనల్ కంపెనీలకు డేటాబేస్, హార్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమర్షియల్, లేబర్ వంటి విషయాల్లో థర్డ్‌పార్టీగా ఉంటూ సహాయం అందిస్తుంటుంది. మొదట్లో ఇద్దరితో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం 1600మందితో విజయవంతంగా నడుస్తున్నది. వీరిలో దాదాపు 900మంది దివ్యాంగులే. వింటూ, మాట్లాడుతూ.. చేతనైన పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి ఉద్యోగాలు కల్పిస్తూ.. వారి జీవితానికి భరోసా కల్పిస్తున్నది పవిత్ర. ఈ కంపెనీ ప్రారంభించిన మొదట్లో ఓ బోటిక్ కంపెనీ నుంచి డేటాబేస్ ఆఫర్ వచ్చింది. దానికి కష్టపడి పనిచేసి మెప్పు పొందిన పవిత్ర టీం.. ఇప్పుడు విప్రో, వీడియోకాన్ డీటీహెచ్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు, పలు మైక్రోఫైనాన్స్ కంపెనీలకు సేవలందిస్తున్నది. 2006లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు పలువురు ఉద్యోగులు వెళ్లిపోయినా దివ్యాంగులు మాత్రం రేయింబవళ్లు కష్టపడి పవిత్ర కంపెనీని మళ్లీ ఓ పోజిషన్‌లో నిలబెట్టారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్న తమ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా పవిత్ర ముందుంటారు. ఆర్థిక స్థితిగతులను, పనిని చూసి అవకాశమిచ్చే పవిత్రను పలువురు అభినందిస్తున్నారు.

285
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles