దివ్యాంగుల కోసం..!


Sat,November 24, 2018 12:16 AM

నోట్లోకి ముద్ద పోవడమే కష్టమవుతున్న పేదలకు అంగవైకల్యంతో పిల్లలు పుడితే.. వారి పరిస్థితి చెప్పుకోలేనిది. అలాంటి పిల్లలకు అండగా నిలబడాలనుకున్నదీ మహిళ.
sonalee
ముంబైకి చెందిన ఈమె.. సోనాలీ శ్యామ్‌సుందర్. శ్రీలంకను సందర్శించిన ఈమెకు అక్కడి వాతావరణం బాగా నచ్చింది. పుట్టిన పిల్లలను ఎన్ని లోపాలున్నా వారిని ప్రేమగా పెంచే విధానం ఇంకా ఆకట్టుకున్నది. మనదగ్గర పుట్టుకతో వైకల్యం ఉన్నవారిని కొంతమంది పురిటిలోనే చంపేయడం, చెత్తకుప్పలో పడేయడం చేస్తుంటారు. ఈ విధానానికి ఎలాగైనా స్వస్తి పలుకాలని నిర్ణయించుకున్నది. దివ్యాంగ పిల్లలపై ఉన్న శ్రద్ధతో ఇండియాకు వచ్చేసింది. ఇక్కడ చాలామంది పేదలు సరైన ఉపాధి లేక పస్తులుండడం చూసింది. పేదరికంతో పాటు, అంగవైకల్యంతో పుట్టిన పిల్లలు తల్లిదండ్రులకు భారంగా మారుతున్న తీరు చూసి చలించింది. దీంతో దివ్యాంగ పిల్లలందరినీ ఒకచోటుకి చేర్చి, వారికి కావాల్సిన వసతులను కల్పించాలనుకున్నది. అలా ముంబైలోని ఊర్మీ ఫౌండేషన్‌ను స్థాపించింది. ముంబైలోని పలుచోట్ల ఈ సంస్థ ద్వారా 18 స్కూల్స్‌ని ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని పిల్లల అవసరాలు తీర్చుతున్నది. సోనాలీ చూపే ప్రేమతో తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది.

626
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles