దప్పిక తీర్చే జావ!


Wed,May 31, 2017 12:16 AM

ragi-malt
రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మాట మేం చెప్పింది కాదు.. నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఇంకేం ఉన్నాయో తెలుసా?
రాగి జావను పాలలో, మజ్జిగలో కలిపి తాగితే పిల్లలకు పుష్కలమైన క్యాల్షియం అందుతుంది. రాగులతో చేసే వంటలను తినడం ద్వారా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్లకు రాగులతో చేసిన ఆహారపదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. రాగులు కడుపులో మంటను తగ్గిస్తాయి. వేసవిలో దప్పికను అరికడతాయి. వృద్ధులకు, మహిళల్లో ఎముకల పటుత్వానికి రాగి మాల్ట్ చాలా మంచిది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ఈ రాగి జావ తాగాల్సిందేనట. రాగులలో ఉండే అయోడిన్ ఎదిగే పిల్లలకు ఎంతగానో తోడ్పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

382
Tags

More News

VIRAL NEWS