థైరాయిడ్ సమస్యలకు హోమియో


Wed,July 6, 2016 01:47 AM

flowerథైరాయిడ్ గ్రంథి సీతాకోక చిలుక ఆకారంలో గొంతు భాగంలో ఉంటుది. ఇది పిట్యుటరీ గ్రంథి అధీనంలో ఉంటుంది. ఇది ఉత్పత్తి చేసే టి3, టి4 తగ్గి, టిఎస్‌హెచ్ పెరగడం వల్ల హైపోథైరాయిడిజమ్, టి3, టి4 పెరిగి, టిఎస్‌హెచ్ తగ్గడం వల్ల హైపర్ థైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడ్ లోపాలు మన శారీరక, మానసిక స్థితుల మీద పనిచేస్తాయి. వీటి లోపం వల్ల బరువు పెరగడం, మానసిక ఆందోళన, గుండె సంబంధిత వ్యాధులు, వెంట్రుకలు ఊడిపోవడం, లైంగిక లోపాలు, సంతానలేమి లాంటి సమస్యలు వస్తాయి. ప్రపంచ జనాభాలో సుమారు 75 శాతం మంది స్త్రీలు, 15 శాతం పురుషులు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు.
టి3, టి4 హార్మోన్లు శరీరంలో బిఎంఆర్‌ను పెంచుతాయి. కొవ్వులు, కార్బోహైడ్రేట్ల జీవక్రియలను పెంచుతాయి. ప్రొటీన్ల తయారీలో పాల్గొంటాయి. గుండె, ఇతర అవయవాలకు రక్తసరఫరా పెంచుతాయి. పిల్లల్లో థైరాయిడ్ హార్మోన్ల వల్ల గుండె, మెదడు పెరుగుదలకు తోడ్పడతాయి. ఎముకల ఎదుగుదల, కాల్షియం జీవక్రియలకు కూడా ఈ హార్మోన్లు అవసరం. థైరాయిడ్ వాచినా, హార్మోన్లు ఎక్కువ తక్కువలైనా సమస్యలు వస్తాయి.

హైపర్ థైరాయిడిజమ్


థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ అవుతాయి. ఆకలి బాగా ఉంటుంది. బరువు తగ్గుతారు. కోపం, చిరాకు, నీరసం, నాడీవేగం హెచ్చుతాయి. కాళ్లూచేతులు వణకడం, వేడి భరింపలేకపోవడం, నీటి విరేచనాలు ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి వాచి, ఇన్‌ఫ్లమేషన్ ఉంటే థైరోటాక్సికోసిస్ లేదా గ్రేవ్స్ డిసీజ్ అంటారు. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇది ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన స్త్రీలలో వస్తుంది.
కనుగుడ్లు బయటికి వచ్చినట్టుండడం, కన్ను లోపలి కండరాలు, కొవ్వు లోపలి భాగం వాచి, కనుగుడ్లు బయటకు వచ్చేట్టు చేస్తుంది. ఇది థైరాయిడ్ కణితుల రూపంలో ఒకటి లేదా రెండు మూడు ఉండొచ్చు. దీన్ని నాడ్యులర్ గాయిటర్ అని కూడా అంటారు.

హైపోథైరాయిడిజమ్


టి3, టి4 హార్మోన్లు తగ్గిపోతాయి. నీరసం, బద్దకం, చలిగా ఉంటుంది. బరువు పెరుగుతారు. మానసికంగా కుంగిపోతారు. ముఖం వాపు, జుట్టు రాలిపోవడం, మలబద్దకం, చర్మం పొడిబారడం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలుంటాయి.
థైరాయిడ్ గ్రంథిలోనే లోపం ఉంటుంది కాబట్టి దీన్ని హాషిమోటోస్ థైరాయిడ్ వాపు అంటారు. ఇది కూడా ఆటోఇమ్యూన్ వ్యాధే. స్త్రీలలో ఎక్కువ. హైపర్ థైరాయిడ్ నియంత్రణ లేకపోతే హైపోథైరాయిడ్‌గా మారవచ్చు.
చిన్నపిల్లల్లో హైపోథైరాయిడ్ వల్ల పెరుగుదల లోపాలుంటాయి. మెదడు ఎదుగుదల ఆగిపోవచ్చు. పుట్టుకతో కూడా థైరాయిడ్ లోపాలుండవచ్చు.

నిర్ధారణ
టి3, టి4, టిఎస్‌హెచ్ స్థాయి తెలుసుకోవడానికి రక్తపరీక్ష. గ్రేవ్స్ డిసీజ్ ఉన్నప్పుడు టి3, టి4 ఎక్కువగానూ, టిఎస్‌హెచ్ తక్కువగానూ ఉంటాయి. రక్తపరీక్ష ద్వారా థైరాయిడ్ యాంటీబాడీలు కనుక్కోవచ్చు. స్కానింగ్, అల్ట్రాసౌండ్

చికిత్స
హోమియోపతి వైద్య విధానంలో థైరాయిడ్ రావడానికి గల మూలకారణాలను విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణాలను విచారించి, సరైన హోమియో మందుల తత్వ విచారణ ద్వారా చికిత్స చేస్తారు.
murali

1724
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles